పరిచయం
ప్రపంచ సమాచారాన్ని మేనేజ్ చేయడం, దాన్ని విశ్వవ్యాప్తంగా యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంచడం, అలాగే ఉపయోగకరంగా చేయడమే Google లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా లొకేషన్ సమాచారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డ్రైవింగ్ దిశలు మొదలుకుని, మీ సెర్చ్ ఫలితాలలో మీ సమీపంలోని ప్రదేశాల గురించిన ప్రస్తుత సమాచారం, అంటే రెస్టారెంట్‌లో జనాలు ఎక్కువగా ఉండటం లాంటి సంగతులు తెలియజేయడం దాకా అనేక విషయాలలో లొకేషన్ సమాచారం సహకారంతో Googleలో మీ అనుభవాలను మరింత సందర్భోచితంగా, అలాగే సహాయకరంగా మలుచుకోవచ్చు.
వెబ్‌సైట్‌ను సరైన భాషలో అందించడం లేదా Google సర్వీస్‌లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటం వంటి కొన్ని ప్రధాన ప్రోడక్ట్ ఫంక్షనాలిటీలలో కూడా లొకేషన్ సమాచారం సహాయపడుతుంది.
మీరు Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు లొకేషన్ సమాచారంతో సహా Google డేటాను ఎలా ఉపయోగిస్తుంది అనేది Google గోప్యతా పాలసీ వివరిస్తుంది. ఈ పేజీ Google ఉపయోగించే లొకేషన్ సమాచారం, అలాగే దాన్ని ఉపయోగించే మార్గాలను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు అనే దాని గురించి అదనపు వివరాలను అందిస్తుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్‌లకు కొన్ని డేటా ప్రాక్టీసులు భిన్నంగా ఉండవచ్చు. Googleకు చెందిన చిన్నారుల కోసం, Family Linkతో మేనేజ్ చేయబడే Google ఖాతాలు, ప్రొఫైల్స్ కోసం గోప్యతా ప్రకటన, అలాగే Googleకు చెందిన యుక్త వయస్కుల గోప్యతా గైడ్‌లో మరింత తెలుసుకోండి.
Google లొకేషన్ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది?
Google లొకేషన్ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది అనేది, ఉపయోగించబడుతున్న సర్వీస్ లేదా ఫీచర్, అలాగే వ్యక్తుల పరికరం, ఖాతా సెట్టింగ్‌ల ఆధారంగా మారుతూ ఉంటుంది. Google లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించగల కొన్ని కీలక మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
అనుభవాలను ఉపయోగకరంగా చేయడానికి
వ్యక్తులు Google ప్రోడక్ట్‌లలో స్థానికంగా సందర్భోచిత, అలాగే వేగవంతమైన సెర్చ్ ఫలితాలు, వ్యక్తుల రోజువారీ ప్రయాణాల కోసం ట్రాఫిక్ అంచనాలు, అలాగే వ్యక్తికి సంబంధించిన సందర్భాన్ని పరిగణనలోకి తీసుకునే సూచనలను అందించడం వంటి ఇంటరాక్షన్ చేసినప్పుడు ఉపయోగకరమైన సర్వీస్‌లను అందించడానికి Google లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు లేదా సేవ్ చేయవచ్చు. ఉదాహరణకు, సినిమా సమయాల కోసం సెర్చ్ చేస్తున్న ఎవరైనా సినిమాలను వేరే నగరంలో కాకుండా వారి పరిసరాలలోని థియేటర్‌లలో చూడాలనుకుంటున్నారు. Google Mapsలో, లొకేషన్ సమాచారం వ్యక్తులు మ్యాప్‌లో వారి స్థలాన్ని కనుగొనడంలో, అలాగే వారు సందర్శించాలనుకుంటున్న స్థలాలకు నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది.
వ్యక్తులు వారు వెళ్లిన స్థలాలను గుర్తుంచుకోవడంలో సహాయపడటానికి
వ్యక్తులు వారి పరికరాలతో వెళ్లే స్థలాలను టైమ్‌లైన్‌ను ఉపయోగించి గుర్తుంచుకోవడానికి ఎంచుకోవచ్చు. టైమ్‌లైన్‌ను ఉపయోగించడానికి, వ్యక్తులు లొకేషన్ హిస్టరీను ఆన్ చేయవచ్చు, ఇది వారు వెళ్లిన స్థలాలు, అలాగే వారు వెళ్లిన మార్గాల వ్యక్తిగత మ్యాప్‌ను రూపొందించే Google ఖాతా సెట్టింగ్. మీరు లొకేషన్ హిస్టరీను ఉపయోగించడానికి ఎంచుకుంటే, మీరు Google యాప్‌లను తెరిచి ఉంచని సందర్భాలతో సహా మీ పరికరానికి చెందిన ఖచ్చితమైన లొకేషన్‌లు వ్యక్తిగత మ్యాప్‌లో సేవ్ చేయబడతాయి. ఈ సమాచారాన్ని టైమ్‌లైన్‌లో చూడవచ్చు, అలాగే తొలగించవచ్చు.
వ్యక్తులు అంశాలను వేగంగా కనుగొనడంలో, అలాగే మరింత సహాయకరమైన ఫలితాలను పొందడంలో సహాయపడటానికి
ఉదాహరణకు, వెబ్ & యాప్ యాక్టివిటీ అనేది Google ఖాతా సెట్టింగ్, ఇది వ్యక్తులు వారి యాక్టివిటీ డేటా, అలాగే లొకేషన్ వంటి అనుబంధిత సమాచారాన్ని సేవ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా వారు Google సర్వీస్‌లు అంతటా సైన్ ఇన్ చేసినప్పుడు వారి అనుభవాన్ని మరింత వ్యక్తిగతీకరించవచ్చు. ఉదాహరణకు, Search మీరు గతంలో సెర్చ్ చేసిన జనరల్ ఏరియాకు సందర్భోచితమైన ఫలితాలను చూపవచ్చు.
మరింత సందర్భోచితమైన యాడ్‌లను చూపడానికి
మీ లొకేషన్ సమాచారం Google మీకు మరింత సందర్భోచిత యాడ్‌లను చూపడంలో సహాయపడుతుంది. మీరు "నాకు సమీపంలో ఉన్న షూ స్టోర్‌లు" వంటి వాటి కోసం సెర్చ్ చేసినప్పుడు, మీకు సమీపంలోని షూ స్టోర్‌ల నుండి మీకు యాడ్‌లను చూపడానికి లొకేషన్ సమాచారం ఉపయోగించబడవచ్చు. లేదా, మీరు పెంపుడు జంతువుల బీమా కోసం సెర్చ్ చేస్తున్నారని అనుకుందాం, అడ్వర్టయిజర్‌లు వివిధ ప్రాంతాలలో వివిధ ప్రయోజనాలను చూపవచ్చు. యాడ్‌లను చూపడానికి లొకేషన్ సమాచారం ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోండి.
అనుభవాలను మరింత సురక్షితంగా చేయడానికి
అసాధారణ యాక్టివిటీని గుర్తించడం, లేదా కొత్త నగరం నుండి సైన్-ఇన్ చేయడం వంటి వాటిని పసిగట్టడం ద్వారా మీ ఖాతాను సురక్షితంగా ఉంచడం కోసం కొన్ని ప్రాథమిక సర్వీస్‌లను అందించడానికి Google మీ లొకేషన్‌ను గురించిన సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
అంచనాలకు, అలాగే రీసెర్చ్ కోసం అజ్ఞాతీకరించిన కమ్యూనిటీ ట్రెండ్‌లను చూపడానికి
Google పరిశోధన కోసం, అలాగే కమ్యూనిటీ ట్రెండ్‌లను చూపడానికి సమగ్రపరచిన అజ్ఞాత లొకేషన్ సమాచారాన్ని కూడా ఉపయోగిస్తుంది.
లొకేషన్ సమాచారం ఉపయోగించబడే మరిన్ని మార్గాలను చూడటానికి, Google గోప్యతా పాలసీను సందర్శించండి.
నా Android పరికరం, ఇంకా యాప్‌లలో లొకేషన్ ఎలా పని చేస్తుంది?
మీరు మీ పరికర లొకేషన్ నుండి లోకల్ సెర్చ్ ఫలితాలను, రోజువారీ ప్రయాణ సూచనలను పొందవచ్చు, అలాగే సమీపంలోని రెస్టారెంట్‌లను కనుగొనవచ్చు. మీ పరికరంలోని లొకేషన్ సర్వీస్‌లు లొకేషన్‌ను అంచనా వేయాలో లేదో, మీ పరికరంలోని నిర్దిష్ట యాప్‌లు, సర్వీస్‌లు ఆ లొకేషన్‌ను ఉపయోగించవచ్చో లేదో, ఒకవేళ ఉపయోగిస్తే ఎలా ఉపయోగించవచ్చు అనేది కంట్రోల్ చేయడానికి మీ మొబైల్ ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లకు సంబంధించిన Android పరికర సెట్టింగ్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి.
పరికర లొకేషన్‌ను యాప్ ఎలా ఉపయోగిస్తుంది అనేది మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు
మీ Android పరికర సెట్టింగ్‌లలో పరికర లొకేషన్‌ను ఉపయోగించడానికి ఏ యాప్‌లకు అనుమతి ఉండాలి అనేది మీరు కంట్రోల్ చేయవచ్చు. సెట్టింగ్‌లలో, యాప్ ఖచ్చితమైన లేదా రమారమి లొకేషన్‌ను యాక్సెస్ చేయగలదో లేదో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించే కంట్రోల్స్‌ను మీరు కలిగి ఉంటారు. యాప్ పరికరాన్ని ఎప్పుడైనా యాక్సెస్ చేయగలగడం, యాప్ ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేయడం, యాప్ ప్రతిసారీ అడగవలసి రావడం లేదా ఎప్పుడూ అడగాల్సిన అవసరం లేకపోవడం అనేవి నిర్ణయించుకోవడానికి మిమ్మల్ని అనుమతించే కంట్రోల్స్‌ను మేము జోడించాము. ఈ సెట్టింగ్‌లు, అలాగే కంట్రోల్స్ లభ్యత మీ పరికరం ఏ Android వెర్షన్‌లో రన్ అవుతోంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరింత తెలుసుకోండి.
పరికరం లొకేషన్ ఎలా పని చేస్తుంది
మీ పరికర సెట్టింగ్‌ల ఆధారంగా, Android పరికరాలు GPS, సెన్సార్‌లు (యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, అలాగే బారోమీటర్ వంటివి), మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్, ఇంకా Wi-Fi సిగ్నల్స్‌తో సహా వివిధ ఇన్‌పుట్‌లను ఉపయోగించడం ద్వారా లొకేషన్‌ను అంచనా వేస్తాయి. అవసరమైన అనుమతులు ఉన్న పరికరంలోని యాప్‌లు, సర్వీస్‌లకు అందించబడే అత్యంత ఖచ్చితమైన లొకేషన్‌ను అంచనా వేయడానికి ఈ ఇన్‌పుట్‌లను ఉపయోగించవచ్చు. మీ Android పరికర లొకేషన్ సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి.
మొబైల్, ఇంకా Wi-Fi నెట్‌వర్క్ సిగ్నల్స్ ముఖ్యంగా GPS సిగ్నల్స్ అందుబాటులో లేదా ఖచ్ఛితంగా లేని పరిస్థితులలో, జనసాంద్రత గల పట్టణ ప్రాంతాలలో లేదా ఇంటి లోపల ఉన్నప్పుడు పరికర లొకేషన్‌ను అంచనా వేయడంలో Androidకు సహాయపడవచ్చు. Google లొకేషన్ ఖచ్చితత్వం (GLA, Google లొకేషన్ సర్వీస్‌లు అని కూడా పిలుస్తారు) అనేది పరికర లొకేషన్ అంచనాను మెరుగుపరచడానికి ఈ సిగ్నల్స్‌ను ఉపయోగించే ఒక Google సర్వీస్.
ఈ మరింత ఖచ్చితమైన లొకేషన్‌ను అందించడానికి, ఆన్ చేసినప్పుడు, GLA కాలానుగుణంగా ఎవరైనా ఒక నిర్దిష్ట వ్యక్తితో అనుబంధించబడని తాత్కాలిక భ్రమణ పరికర ఐడెంటిఫైయర్‌ను ఉపయోగించి—GPS, ఇంకా Wi-Fi యాక్సెస్ పాయింట్‌లు, మొబైల్ నెట్‌వర్క్‌లు, అలాగే పరికర సెన్సార్‌ల గురించిన సమాచారంతో సహా—మీ Android పరికరం నుండి లొకేషన్ సమాచారాన్ని సేకరిస్తుంది. GLA ఈ సమాచారాన్ని Wi-Fi యాక్సెస్ పాయింట్‌లు మొబైల్ నెట్‌వర్క్ టవర్‌లకు చెందిన క్రౌడ్‌సోర్స్ చేసిన మ్యాప్‌లను రూపొందించడంతో సహా లొకేషన్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచి, లొకేషన్ ఆధారిత సర్వీస్‌లను అందించడానికి ఉపయోగిస్తుంది.
మీరు మీ Android పరికరం లొకేషన్ సెట్టింగ్‌లలో ఎప్పుడైనా GLAను ఆఫ్ చేయవచ్చు. GLA ఆఫ్ చేయబడినప్పటికీ మీ Android పరికర లొకేషన్ పని చేస్తూనే ఉంటుంది, అలాగే పరికర లొకేషన్‌ను అంచనా వేయడానికి GPS, ఇంకా పరికర సెన్సార్‌లపై మాత్రమే ఆధారపడుతుంది.
Googleకు నా స్థానం ఎలా తెలుస్తుంది?
మీరు ఉపయోగిస్తున్న ప్రోడక్ట్‌లు, అలాగే మీరు ఎంచుకున్న సెట్టింగ్‌లను బట్టి, మీరు ఉపయోగించే కొన్ని సర్వీస్‌లు, ప్రోడక్ట్‌లను మరింత సహాయకరంగా చేయడంలో సహాయం చేయడానికి Google వివిధ రకాల లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
ఈ లొకేషన్ సమాచారం మీ IP అడ్రస్ లేదా మీ పరికరం వంటి రియల్ టైమ్ సిగ్నల్స్ నుండి, అలాగే Google Sites, అలాగే సర్వీస్‌లలో మీరు సేవ్ చేసిన యాక్టివిటీ నుండి కూడా రావచ్చు. Google మీ లొకేషన్ గురించి సమాచారాన్ని పొందగల ప్రధాన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
మీ IP అడ్రస్ నుండి
IP అడ్రస్, దీన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అని కూడా పిలుస్తారు, ఇది మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీ కంప్యూటర్ లేదా పరికరానికి కేటాయించబడిన నంబర్. IP అడ్రస్‌లు, మీరు ఉపయోగించే వెబ్‌సైట్‌లను, సర్వీస్‌లను మీ పరికరాలకు కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడతాయి.
పలు ఇతర ఇంటర్నెట్ సర్వీస్‌ల మాదిరిగానే, Google కొన్ని ప్రాథమిక సర్వీస్‌లు—సందర్భోచిత ఫలితాలను అందించడానికి మీరు ఉన్న జనరల్ ఏరియా గురించిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు, అంటే ఎవరైనా సమయం ఎంత అయ్యింది అని సెర్చ్ చేసినప్పుడు, లేదా కొత్త నగరం నుండి సైన్-ఇన్ చెయాయడం వంటి అసాధారణ యాక్టివిటీను గుర్తించడం ద్వారా మీ ఖాతాను సురక్షితంగా ఉంచడం వంటివి.
గుర్తుంచుకోండి: ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను పంపడానికి, స్వీకరించడానికి పరికరాలకు IP అడ్రస్ అవసరం. IP అడ్రస్‌లు అనేవి ఇంచుమించుగా మీ భౌగోళిక ప్రాంతం మీద ఆధారపడి ఉంటాయి. అంటే google.comతో సహా మీరు ఉపయోగించే ఏవైనా యాప్‌లు, సర్వీస్‌లు లేదా వెబ్‌సైట్‌లు మీ IP అడ్రస్ నుండి మీ జనరల్ ఏరియా గురించి కొంత సమాచారాన్ని అంచనా వేసి ఉపయోగించగలవు.
మీరు సేవ్ చేసిన యాక్టివిటీ నుండి
మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, వెబ్ & యాప్ యాక్టివిటీను ఆన్ చేసి ఉంటే, Google సైట్‌లు, యాప్‌లు, అలాగే సర్వీస్‌లలో మీ యాక్టివిటీ డేటా మీ ఖాతా వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ చేయబడవచ్చు. యాక్టివిటీలో కొంత మీరు Google సర్వీస్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఉన్న జనరల్ ఏరియా గురించిన సమాచారం ఉండవచ్చు. మీరు జనరల్ ఏరియాను ఉపయోగించి ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, మీ సెర్చ్ కనీసం 3 చదరపు కిలోమీటర్‌ల విస్తీర్ణాన్ని ఉపయోగిస్తుంది లేదా ఆ ఏరియా కనీసం 1,000 మంది వ్యక్తుల లొకేషన్‌లను సూచించే వరకు విస్తరిస్తుంది. ఇది మీ గోప్యతను రక్షించడంలో సహాయపడుతుంది.
కొన్ని సందర్భాలలో, మీ సెర్చ్ కోసం సందర్భోచిత లొకేషన్‌ను అంచనా వేయడానికి మీరు గతంలో సెర్చ్ చేసిన ప్రాంతాలు ఉపయోగించబడవచ్చు. ఉదాహరణకు, మీరు చెల్సియాలో ఉన్నప్పుడు కాఫీ షాప్‌ల కోసం సెర్చ్ చేస్తే, భవిష్యత్ సెర్చ్‌లలో చెల్సియా కోసం Google ఫలితాలను చూపవచ్చు.
మీరు నా యాక్టివిటీలో మీ వెబ్ & యాప్ యాక్టివిటీను చూడవచ్చు, అలాగే కంట్రోల్ చేయవచ్చు.
మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండకపోతే, మీకు మరిన్ని సందర్భోచితమైన ఫలితాలు, సిఫార్సులు అందించడంలో సహాయపడటానికి మీరు వాడుతున్న పరికరం నుండి మునుపటి సెర్చ్‌లకు సంబంధించిన కొంత లొకేషన్ సమాచారాన్ని Google స్టోర్ చేయవచ్చు. మీరు Search అనుకూలీకరణను ఆఫ్ చేస్తే, మీ లొకేషన్‌ను అంచనా వేయడానికి Google మునుపటి సెర్చ్ యాక్టివిటీను ఉపయోగించదు. ప్రైవేట్‌గా సెర్చ్ చేయడం, బ్రౌజ్ చేయడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీరు సేవ్ చేసిన ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌ల నుండి
మీ ఇల్లు లేదా మీ ఆఫీస్ వంటి మీకు ముఖ్యమైన స్థలాలను మీ Google ఖాతాలో సేవ్ చేయడానికి మీరు ఎంచుకోవచ్చు. మీ ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌లను మీరు సెట్ చేస్తే, దిశలను పొందడం లేదా మీ ఇల్లు లేదా ఆఫీస్‌కు దగ్గరగా ఫలితాలను కనుగొనడం వంటి పనులను మరింత సులభంగా చేయడంలో మీకు సహాయపడటానికి, మరింత ఉపయోగకరమైన యాడ్‌లను మీకు చూపడం కోసం వాటిని ఉపయోగించవచ్చు.
మీరు మీ Google ఖాతాలో ఎప్పుడైనా మీ ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌లను ఎడిట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.
మీ పరికరం నుండి
Google యాప్‌లు మీ పరికరం నుండి లొకేషన్‌ను ఎలా ఉపయోగిస్తాయి
Search అలాగే Maps వంటి Google యాప్‌లతో సహా యాప్‌లకు మీ ఖచ్చితమైన లొకేషన్ అందుబాటులో ఉందో లేదో కంట్రోల్ చేయడానికి పరికరాలలో సెట్టింగ్‌లు లేదా అనుమతులు ఉన్నాయి. ఇలాంటి ఖచ్చితమైన లొకేషన్, Google Maps వంటి యాప్‌లలో దిశలు చూపడానికి లేదా సమీపంలోని ఉపయోగకరమైన సెర్చ్ ఫలితాలను మీరు పొందడంలో సహాయపడడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఖచ్చితమైన లొకేషన్ సెట్టింగ్‌లు లేదా అనుమతులు ఆన్‌లో ఉన్నప్పుడు మీరు లోకల్ స్థలాలు, వాతావరణ సమాచారం వంటి అంశాల కోసం మరింత సందర్భోచిత సెర్చ్ ఫలితాలను పొందుతారు.
iOS, Android రెండూ యాప్ లొకేషన్ అనుమతుల కోసం సెట్టింగ్‌లను కలిగి ఉన్నాయి, వీటిని మీరు ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. లొకేషన్ ఆధారిత ఫీచర్‌లు, సర్వీస్‌లను అందించేందుకు, మీ లొకేషన్‌ను ఉపయోగించడానికి మీరు యాప్‌లను అనుమతించవచ్చు. గుర్తుంచుకోండి, యాప్‌లు మీ ఖచ్చితమైన లొకేషన్‌ను తాత్కాలికంగా స్టోర్ చేయడం కొన్నిసార్లు అవసరం, తద్వారా అవి మీకు సహాయకరమైన ఫలితాలను త్వరగా అందించగలవు లేదా లొకేషన్‌ను అప్‌డేట్ చేయాల్సిన అవసరాన్ని నివారించడం ద్వారా బ్యాటరీని ఆదా చేయగలవు.
కొన్ని యాప్‌లకు లేదా మీరు లొకేషన్ షేరింగ్ వంటి నిర్దిష్ట ఫీచర్‌లను ఉపయోగించాలనుకుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో మీ పరికర లొకేషన్‌కు యాక్సెస్ అవసరం అవుతుంది, ఉదాహరణకు Find My Device.
మీ Android పరికరంలో లొకేషన్ ఎలా పని చేస్తుందనే దాని గురించి మరింత సమాచారం కోసం, ఇక్కడ చూడండి.
నా Google ఖాతాలో లొకేషన్ హిస్టరీ, ఇంకా వెబ్ & యాప్ యాక్టివిటీ ఎలా సేవ్ చేయబడతాయి?
రాబోయే నెలల్లో, అలాగే 2024 సంవత్సరం మధ్యలో, లొకేషన్ హిస్టరీ సెట్టింగ్ మారుతుంది. ఈ మార్పు వారి ఖాతాను ప్రభావితం చేసినప్పుడు ప్రస్తుత లొకేషన్ హిస్టరీ యూజర్‌లకు తెలియజేయబడుతుంది, అలాగే వారికి తెలియజేయబడిన తర్వాత, వారు వారి ఖాతా, ఇంకా యాప్ సెట్టింగ్‌లలో టైమ్‌లైన్ పేరును చూడటం ప్రారంభిస్తారు. టైమ్‌లైన్‌ను నేరుగా ఆన్ చేసిన యూజర్‌లతో సహా ఇప్పటికే టైమ్‌లైన్‌ను ఉపయోగిస్తున్న వారికి, లొకేషన్ హిస్టరీలోని లొకేషన్ డేటా గురించి ఈ పేజీలో అందించిన సమాచారం వారి టైమ్‌లైన్ వినియోగానికి వర్తిస్తుంది. మరింత తెలుసుకోండి.
లొకేషన్ హిస్టరీ, వెబ్ & యాప్ యాక్టివిటీ
లొకేషన్ హిస్టరీ, అలాగే వెబ్ & యాప్ యాక్టివిటీ అనేది లొకేషన్‌ను ఉపయోగించే Google ఖాతా సెట్టింగ్‌లు. ఒకొక్క దానికి సంబంధించిన ఓవర్‌వ్యూ ఇక్కడ ఉంది. ఇతర ఫీచర్‌లు లేదా ప్రోడక్ట్‌లు కూడా లొకేషన్ సమాచారాన్ని సేకరించవచ్చు లేదా స్టోర్ చేయవచ్చని గుర్తుంచుకోండి.
లొకేషన్ హిస్టరీ
మీరు లొకేషన్ హిస్టరీను ఆన్ చేస్తే, అది టైమ్‌లైన్‌ను, మీరు వెళ్లిన స్థలాలు, అలాగే మీరు వెళ్లిన మార్గాలు, ట్రిప్‌లను గుర్తుంచుకోవడంలో మీకు సహాయపడే వ్యక్తిగత మ్యాప్‌లను క్రియేట్ చేస్తుంది.
ఆటోమేటిక్‌గా లొకేషన్ హిస్టరీ ఆఫ్‌లో ఉంటుంది. మీరు లొకేషన్ హిస్టరీను ఆన్ చేస్తే, లొకేషన్ రిపోర్టింగ్ సెట్టింగ్ ఆన్ చేయబడిన అర్హత ఉన్న ప్రతి మొబైల్ పరికరంలో మీ ఖచ్చితమైన పరికర లొకేషన్ క్రమం తప్పకుండా సేవ్ చేయబడుతుంది. Google యాప్‌లు ఉపయోగించనప్పటికీ, మీ టైమ్‌లైన్‌ను రూపొందించడానికి ఈ పరికర లొకేషన్‌లు ఉపయోగించబడతాయి.
Google అనుభవాలను అందరికీ మరింత ఉపయోగకరంగా చేయడానికి, లొకేషన్ హిస్టరీను దీని కోసం ఉపయోగించవచ్చు
- అజ్ఞాత లొకేషన్ సమాచారం ఆధారంగా రద్దీగా ఉండే సమయాలు, అలాగే పర్యావరణ గణాంకాల వంటి సమాచారాన్ని చూపడానికి
- మోసం, దుర్వినియోగాన్ని గుర్తించి, నివారించడంలో సహాయపడటానికి
- యాడ్స్ ప్రోడక్ట్‌లతో సహా Google సర్వీస్‌లను మెరుగుపరచండి, అలాగే డెవలప్ చేయండి
యాడ్ కారణంగా వ్యక్తులు తమ స్టోర్‌లను సందర్శించే అవకాశాన్ని అంచనా వేయడంలో కూడా లొకేషన్ హిస్టరీ బిజినెస్‌లకు సహాయపడుతుంది.
మీరు ఎప్పుడైనా మీ టైమ్‌లైన్‌లో సేవ్ చేసిన వాటిని రివ్యూ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు. మీరు లొకేషన్ హిస్టరీను ఆన్ చేసారో లేదో చూడటానికి, మీ యాక్టీవిటీ కంట్రోల్స్‌ను సందర్శించండి. అక్కడ, మీరు లొకేషన్ హిస్టరీ సెట్టింగ్‌ను కంట్రోల్ చేయగలరు, అలాగే ఏ పరికరాలలో వాటి లొకేషన్ హిస్టరీ ఆన్ చేసి ఉండాలో కంట్రోల్ చేయగలరు.
లొకేషన్ హిస్టరీ సెట్టింగ్‌లో భాగంగా మీ ఖచ్చితమైన లొకేషన్ ఎంత తరచుగా సేకరించబడుతుంది అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు Google Mapsలో నావిగేషన్‌ను ఉపయోగిస్తుంటే, అది నిమిషానికి పలు సార్లు సేకరించబడవచ్చు. కానీ మీరు మీ ఫోన్‌ను యాక్టివ్‌గా ఉపయోగించకపోయినట్లయితే, అది ప్రతి కొన్ని గంటలకు ఒకసారే కావచ్చు.
లొకేషన్ హిస్టరీ డేటా ఎంతకాలం సేవ్ చేయబడుతుందనేది మీ సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది—మీరు ఈ డేటా 3, 18 లేదా 36 నెలలు నిండిన తర్వాత ఆటోమేటిక్‌గా తొలగించడాన్ని ఎంచుకోవచ్చు లేదా మీరు దానిని తొలగించే వరకు అలాగే ఉంచుకోవచ్చు.
వీటిని గుర్తుంచుకోండి
మీరు లొకేషన్ హిస్టరీను ఆఫ్ చేస్తే
- మీరు తొలగించే వరకు Google మీరు సేవ్ చేసిన ఏదైనా గత లొకేషన్ హిస్టరీ డేటాను స్టోర్ చేయడం కొనసాగిస్తుంది లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్‌లలో భాగంగా మీరు ఎంచుకున్న సమయం తర్వాత అది తొలగించబడుతుంది.
- లొకేషన్ హిస్టరీను ఆఫ్ చేయడం వలన వెబ్ & యాప్ యాక్టివిటీ లేదా ఇతర Google ప్రోడక్ట్‌ల ద్వారా లొకేషన్ సమాచారం ఎలా సేవ్ చేయబడుతుంది లేదా ఉపయోగించబడుతుంది అనేది ప్రభావితం కాదు, ఉదా. మీ IP అడ్రస్ ఆధారంగా. మీరు ఇప్పటికీ లొకేషన్ సమాచారాన్ని సేవ్ చేసే ఇతర సెట్టింగ్‌లను కలిగి ఉండవచ్చు.
మీరు లొకేషన్ హిస్టరీను ఆన్ చేసారో లేదో చూడటానికి, మీ యాక్టీవిటీ కంట్రోల్స్‌ను సందర్శించండి. మరింత తెలుసుకోండి.
వెబ్ & యాప్ కార్యకలాపం
Maps, Search, అలాగే ఇతర Google సర్వీస్‌లలో మీ అనుభవాన్ని మరింత వ్యక్తిగతీకరించడానికి వెబ్ & యాప్ యాక్టివిటీ డేటా ఉపయోగించబడుతుంది. ఇది మీ యాడ్స్ సెట్టింగ్‌ల ఆధారంగా మీకు మరింత సందర్భోచిత యాడ్స్‌ను చూపడానికి కూడా ఉపయోగించవచ్చు. మీరు మీ ఖాతాకు సైన్ ఇన్ చేసిన ఏ పరికరాలలో అయినా వెబ్ & యాప్ యాక్టివిటీ పని చేస్తుంది.
వెబ్ & యాప్ యాక్టివిటీను ఆన్ చేసినప్పుడు, Google సర్వీస్‌లలో మీరు చేసే పనులకు సంబంధించిన డేటాను Google మీ ఖాతా వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ చేస్తుంది. దీనిలో మీరు Google సర్వీస్‌ను ఉపయోగించిన జనరల్ ఏరియా వంటి అనుబంధిత సమాచారం ఉంటుంది.
ఉదాహరణకు, మీరు వాతావరణ సమాచారం కోసం సెర్చ్ చేసి, మీ పరికరం నుండి పంపబడిన లొకేషన్ కోసం ఫలితాలను పొందినట్లయితే, మీరు సెర్చ్ చేసినప్పుడు మీ పరికరం ఉన్న జనరల్ ఏరియాతో సహా ఈ యాక్టివిటీ మీ వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ చేయబడుతుంది. మీ పరికరం పంపిన ఖచ్చితమైన లొకేషన్ స్టోర్ చేయబడదు, లొకేషన్‌కు చెందిన జనరల్ ఏరియా మాత్రమే స్టోర్ చేయబడుతుంది. భవిష్యత్తులో సెర్చ్‌లో మరింత సందర్భోచిత లొకేషన్‌ను గుర్తించడంలో Googleకు సహాయపడటానికి ఉపయోగించబడే సేవ్ చేయబడిన లొకేషన్ IP అడ్రస్ లేదా మీ పరికరం నుండి రావచ్చు. ఈ సేవ్ చేయబడిన లొకేషన్ 30 రోజుల తర్వాత మీ వెబ్ & యాప్ యాక్టివిటీ నుండి ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.
వెబ్ & యాప్ యాక్టివిటీ డేటా మీకు సంబంధించిన జనరల్ ఏరియాలను అర్థం చేసుకోవడంలో Googleకు సహాయపడుతుంది, అలాగే మీరు సెర్చ్ చేయడం వంటి పనులు చేసినప్పుడు ఆ ఏరియాలకు సంబంధించిన ఫలితాలను చేర్చుతుంది.
మీరు మీ వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ చేసిన లొకేషన్, అలాగే ఇతర సమాచారాన్ని రివ్యూ చేసి, తొలగించవచ్చు, లేదా మీ యాక్టీవిటీ కంట్రోల్స్‌ను సందర్శించడం ద్వారా దాన్ని ఆఫ్ చేయవచ్చు. వెబ్ & యాప్ యాక్టివిటీను ఆఫ్ చేయడం వలన మీ భవిష్యత్ యాక్టివిటీ డేటా సేవ్ చేయబడదు.
వీటిని గుర్తుంచుకోండి
మీరు వెబ్ & యాప్ యాక్టివిటీను ఆఫ్ చేసినప్పుడు
- మీరు ఇప్పటికీ సేవ్ చేసిన యాక్టివిటీను కలిగి ఉండవచ్చు, మీరు దాన్ని తొలగించే వరకు అది ఉపయోగించబడుతుంది. మీరు దీన్ని ఎప్పుడైనా తొలగించవచ్చు. మీరు సేవ్ చేసిన లొకేషన్ సమాచారం ఇప్పటికీ 30 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.
- వెబ్ & యాప్ యాక్టివిటీను ఆఫ్ చేయడం వలన లొకేషన్ హిస్టరీ వంటి ఇతర సెట్టింగ్‌ల ద్వారా లొకేషన్ సమాచారం ఎలా సేవ్ చేయబడుతుంది లేదా ఉపయోగించబడుతుంది అనే దానిపై ప్రభావం ఉండదు. మీరు ఇప్పటికీ IP అడ్రస్‌తో సహా ఇతర సెట్టింగ్‌లలో భాగంగా ఇతర రకాల లొకేషన్ సమాచారాన్ని సేవ్ చేసి ఉండవచ్చు.
మీరు వెబ్ & యాప్ యాక్టివిటీను ఆన్ చేశారో లేదో చూడటానికి, మీ యాక్టివిటీ కంట్రోల్స్‌ను సందర్శించండి. మరింత తెలుసుకోండి
సాధారణీకరించిన లేదా అజ్ఞాత లొకేషన్ సమాచారాన్ని Google ఎలా ఉపయోగిస్తుంది?
వ్యక్తుల గోప్యతను మెరుగుపరచడంలో సహాయపడటానికి Google అజ్ఞాతీకరించిన, అలాగే సాధారణీకరించిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. అజ్ఞాతీకరించిన సమాచారం సాధారణంగా ఏ వ్యక్తితోనూ అనుబంధించబడదు. ఒక వ్యక్తికి చెందిన ఖాతా, పేరు లేదా ఈమెయిల్ అడ్రస్ వంటి వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం కాకుండా, సాధారణీకరించిన సమాచారం, సంఖ్యల స్ట్రింగ్ వంటి ప్రత్యేక ఐడెంటిఫైయర్‌తో ముడిపడి ఉండవచ్చు. అడ్వర్టయిజింగ్ లేదా ట్రెండ్‌ల వంటి ప్రయోజనాల కోసం Google తన ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లలో అజ్ఞాతీకరించిన, అలాగే సాధారణీకరించిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
లొకేషన్ సమాచారానికి లింక్ చేయబడిన నిర్దిష్ట యూజర్‌ను గుర్తించని ఐడెంటిఫయర్‌లను యూజర్‌లు రీసెట్ చేయగలరు. ఉదాహరణకు, వ్యక్తులు వారి Android పరికరాలలో అడ్వర్టయిజింగ్ IDలను రీసెట్ చేయడం ద్వారా నిర్దిష్ట యూజర్‌ను గుర్తించని ఐడెంటిఫయర్‌లను రీసెట్ చేయవచ్చు. అదనంగా, Google ఆటోమేటిక్‌గా యూజర్ గోప్యతను మెరుగుపరచడానికి యూజర్‌లు వారి పరికరాలలో లొకేషన్ ఆధారిత సర్వీస్, అలాగే ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి కంట్రోల్ చేయగల పరికర సెట్టింగ్ అయిన GLAతో సహా నిర్దిష్ట యూజర్‌ను గుర్తించని ఐడెంటిఫయర్‌లను రీసెట్ చేస్తుంది.
ప్రత్యేకంగా, Google అజ్ఞాతీకరించిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వ్యక్తులు Google Mapsలోని స్థలాలను ట్యాప్ చేయవచ్చు, ఉదా., రెస్టారెంట్ లేదా పార్క్‌పై ట్యాప్ చేసి, ఆ ప్రాంతంలోని స్థలాలకు చెందిన ట్రెండ్‌లను చూడవచ్చు. రద్దీగా ఉండే సమయాలు వంటి ట్రెండ్‌లను రూపొందించడానికి ఉపయోగించే లొకేషన్ సమాచారాన్ని ప్రత్యేకంగా ఎవరైనా ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగించడం సాధ్యం కాదు. ఖచ్చితమైన, అలాగే అజ్ఞాతీకరించిన రద్దీ సమాచారాన్ని అందించడానికి Google వద్ద తగినంత సమాచారం లేకపోతే, అది Googleలో కనిపించదు.
Google సైన్ అవుట్ చేసిన వ్యక్తులకు Search అనుకూలీకరణ సెట్టింగ్, YouTube సెట్టింగ్‌లు, అలాగే యాడ్స్ సెట్టింగ్‌లతో సహా వారి బ్రౌజర్ లేదా పరికరంతో అనుబంధించబడిన సమాచారాన్ని మేనేజ్ చేయడానికి ఇతర మార్గాలను కూడా అందిస్తుంది. మరింత తెలుసుకోండి
Google గోప్యతా పాలసీలో లొకేషన్ సమాచారాన్ని Google ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి. సేకరించిన డేటా నిల్వను Google ఎలా కొనసాగిస్తుంది, అలాగే Google డేటాను ఎలా అజ్ఞాతీకరిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
లొకేషన్ సమాచారానికి సంబంధించి Google ఎంతకాలం నిల్వను కొనసాగిస్తుంది?
Google సేకరించే లొకేషన్ సమాచారంతో సహా యూజర్ డేటా కోసం మా నిల్వ కొనసాగింపు ప్రాక్టీస్‌లను Google గోప్యతా పాలసీ వివరిస్తుంది. లొకేషన్ సమాచారం, ఒక అంశం గురించి అది ఏమిటి, అది ఎలా ఉపయోగించబడుతుంది, అలాగే వ్యక్తులు వాటి సెట్టింగ్‌లను ఎలా కాన్ఫిగర్ చేస్తారు అనే దానిపై ఆధారపడి వివిధ కాలాలకు చెందిన సమాచారాన్ని సేకరించబడుతుంది.
మీరు తొలగించే వరకు కొంత లొకేషన్ సమాచారం మీ Google ఖాతాలో సేవ్ చేయబడుతుంది
- నిల్వ కొనసాగింపు, అలాగే తొలగింపునకు సంబంధించిన ఆప్షన్‌లను కంట్రోల్ చేయడం: లొకేషన్ హిస్టరీ, అలాగే వెబ్ & యాప్ యాక్టివిటీ రెండూ ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్‌లను కలిగి ఉంటాయి, ఇవి 3, 18 లేదా 36 నెలల తర్వాత డేటాను ఆటోమేటిక్‌గా తొలగించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు టైమ్‌లైన్, ఇంకా నా యాక్టివిటీను సందర్శించడం ద్వారా కూడా ఈ డేటాను చూడవచ్చు, అలాగే మీ ప్రాధాన్యత ఆధారంగా నిర్దిష్ట యాక్టివిటీ లేదా బల్క్-డేటాను తొలగించవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ సెట్టింగ్‌లను మార్చవచ్చు లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్‌ను మార్చవచ్చు.
- లొకేషన్ సమాచారాన్ని సేవ్ చేయడం: Google ప్రోడక్ట్ లేదా సర్వీస్‌పై ఆధారపడి, లొకేషన్ సమాచారం మీ Google ఖాతాలో సేవ్ చేయబడవచ్చు. ఉదాహరణకు, మీరు ఫోటోలలో లొకేషన్‌లను ట్యాగ్ చేయవచ్చు లేదా Mapsలో ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌ను జోడించవచ్చు. మీరు ఈ లొకేషన్ సమాచారాన్ని తొలగించవచ్చు.
మీరు డేటాను తొలగించినప్పుడు, మీ ఖాతా నుండి సురక్షితంగా, పూర్తిగా తీసివేయడానికి Google ఒక పాలసీను ఫాలో అవుతోంది, తద్వారా డేటా రికవరీ అనేది ఇకపై సాధ్యం కాదు. ముందుగా, మీరు తొలగించే యాక్టివిటీ వీక్షణ నుండి తీసివేయబడుతుంది, అలాగే మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఇకపై ఉపయోగించబడదు. ఆపై, Google స్టోరేజ్ సిస్టమ్‌ల నుండి డేటాను సురక్షితంగా, పూర్తిగా తొలగించడానికి రూపొందించబడిన ప్రాసెస్‌ను Google ప్రారంభిస్తుంది. సేకరించిన డేటాను నిల్వను Google ఎలా కొనసాగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
నిర్ణీత వ్యవధి తర్వాత గడువు ముగుస్తుందనే సమాచారం
ఇతర లొకేషన్ సమాచారం కోసం, Google డేటా నిల్వను ఎలా కొనసాగిస్తుంది అనే దానిలో వివరించిన విధంగా, మాన్యువల్‌గా తొలగించబడే బదులు—Google డేటాను తొలగించే ముందు సెట్ చేసిన సమయం వరకు స్టోర్ చేస్తుంది. దాన్ని సురక్షితంగా, పూర్తిగా తొలగించడానికి పట్టే సమయం డేటా రకంపై ఆధారపడి ఉంటుంది, ఉదాహరణకు:
- Google 9 నెలల తర్వాత IP అడ్రస్‌లో కొంత భాగాన్ని, అలాగే 18 నెలల తర్వాత కుక్కీ సమాచారాన్ని తీసివేయడం ద్వారా సర్వర్ లాగ్‌లలోని అడ్వర్టయిజింగ్ డేటాను అజ్ఞాతీకరిస్తుంది.
- Google 30 రోజుల తర్వాత మీ వెబ్ & యాప్ యాక్టివిటీ నుండి IP-ఆధారిత లొకేషన్, అలాగే పరికర లొకేషన్‌ను తొలగిస్తుంది.
పరిమిత ప్రయోజనాల కోసం పొడిగించిన సమయ వ్యవధుల వరకు సమాచారం నిలిచి ఉంది
Google గోప్యతా పాలసీలో వివరించినట్లుగా, "సెక్యూరిటీ, మోసం, అలాగే దుర్వినియోగ నివారణ లేదా ఆర్థికపరమైన రికార్డ్‌లను దాచి ఉంచడం వంటి చట్టబద్ధమైన బిజినెస్ లేదా చట్టపరమైన ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు మేము కొంత డేటాను ఎక్కువ కాలం పాటు ఉంచుతాము." మా నిల్వ కొనసాగింపు ప్రాక్టీస్‌ల గురించి మరింత తెలుసుకోండి
యాడ్‌ల కోసం లొకేషన్ సమాచారం ఎలా ఉపయోగించబడుతుంది?
మీకు మరింత సందర్భోచిత యాడ్‌లను చూపడంలో సహాయపడటానికి
మీకు కనిపించే యాడ్‌లు మీ లొకేషన్ సమాచారం ఆధారంగా ఉండవచ్చు. సాధారణంగా, Googleలోని యాడ్‌లు అవి కనిపించే ప్రోడక్ట్‌ల మాదిరిగానే ఒకే రకమైన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, మీ సెట్టింగ్‌లపై ఆధారపడి, Searchలో, ఇతర Google ప్లాట్‌ఫామ్‌లలో మీరు చూసే యాడ్‌లు మీ పరికరంలోని లొకేషన్, మీ IP అడ్రస్, మునుపటి యాక్టివిటీ లేదా మీ Google ఖాతాలోని మీ ఇల్లు, అలాగే ఆఫీస్ అడ్రస్‌ల ఆధారంగా ఉండవచ్చు. అదనంగా, మీ దేశం లేదా మీకు ఆసక్తి ఉన్న జనరల్ ఏరియాను అంచనా వేయడానికి మెటాడేటా (ఉదా., బ్రౌజర్ టైమ్‌జోన్, డొమైన్, పేజీ కంటెంట్, బ్రౌజర్ రకం, పేజీ భాష) ఉపయోగించబడవచ్చు. మీ IP అడ్రస్, VPN, ప్రాక్సీ సర్వీస్, లేదా ఇతర నెట్‌వర్క్ సమాచారం నుండి మేము అందుకునే లొకేషన్ సిగ్నల్స్‌తో పాటు ఈ మెటాడేటాను ఉపయోగించవచ్చు.
లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించడం వలన మీకు కనిపించే యాడ్స్ మీరు ఉన్న ప్రాంతానికి లేదా మీకు సంబంధించిన ఏరియాలకు మరింత సందర్భోచితంగా ఉంటుంది. ఉదాహరణకు, మీ పరికరం లొకేషన్ సెట్టింగ్ ఆన్ చేయబడి, మీకు సమీపంలో ఉన్న రెస్టారెంట్‌ల కోసం మీరు Googleలో సెర్చ్ చేసినట్లయితే, మీకు సమీపంలో ఉన్న రెస్టారెంట్‌లకు సంబంధించిన యాడ్స్‌ను మీకు చూపడానికి మీ ప్రస్తుత పరికర లొకేషన్ ఉపయోగించబడవచ్చు. Googleలోని యాడ్స్‌లో భాగంగా సమీపంలోని బిజినెస్‌లకు గల దూరాలను చూపడానికి కూడా మీ లొకేషన్ ఉపయోగించబడవచ్చు.
Google మీకు మరింత ఉపయోగకరమైన యాడ్‌లను చూపడానికి మీ గత బ్రౌజింగ్ లేదా యాప్ యాక్టివిటీ (అంటే మీ సెర్చ్‌లు, వెబ్‌సైట్ సందర్శనలు లేదా మీరు YouTubeలో చూసిన వీడియోలు వంటివి), అలాగే వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్‌లో భాగంగా సేవ్ చేసిన జనరల్ ఏరియాలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు Googleలోని సమీపంలో పాలను ఎక్కడ కొనుగోలు చేయాలో సెర్చ్ చేసినట్లయితే, మీరు మీ బస్సు లేదా రైలు కోసం వేచి చూస్తున్నప్పుడు Google Searchను తరచుగా బ్రౌజ్ చేసే జనరల్ ఏరియాలోని కిరాణా స్టోర్‌లకు సంబంధించిన యాడ్‌లు మీకు కనిపించవచ్చు.
అడ్వర్టయిజర్‌లు వారి బిజినెస్ చుట్టూ ఉన్న దేశాలు, నగరాలు లేదా ప్రాంతాలు వంటి జనరల్ ఏరియాలకు మాత్రమే యాడ్స్‌ను లక్ష్యంగా చేసుకోగలరు.
మా Display Networkలో అదనపు సమాచారం కోసం, సహాయ కేంద్రాన్ని సందర్శించండి.
పనితీరును కోవడంలో అడ్వర్టయిజర్‌లకు సహాయం చేయడానికి
Google సర్వీస్‌లు ఎలా ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఎనలిటిక్స్, అలాగే కొలమానాల కోసం Google లొకేషన్ సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు లొకేషన్ హిస్టరీను ఆన్ చేయాలని ఎంచుకుంటే, ఆన్‌లైన్ యాడ్స్ కారణంగా వ్యక్తులు తమ స్టోర్‌లను సందర్శిస్తున్నారని అంచనా వేయడానికి అడ్వర్టయిజర్‌లకు సహాయం చేయడానికి Google ఈ డేటాను ఉపయోగిస్తుంది. అడ్వర్టయిజర్‌లకు అజ్ఞాత అంచనాలు మాత్రమే షేర్ చేయబడతాయి, వ్యక్తిగత సమాచారం షేర్ చేయబడదు. దీన్ని చేయడానికి, యాడ్ క్లిక్‌ల వంటి మీ ఆన్‌లైన్ యాక్టివిటీ డేటాను అడ్వర్టయిజర్‌ల స్టోర్‌లకు సంబంధించిన లొకేషన్ హిస్టరీ డేటాతో Google కనెక్ట్ చేస్తుంది. మీ లొకేషన్ హిస్టరీ అడ్వర్టయిజర్‌లకు షేర్ చేయబడలేదు.
Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను మెరుగుపరచడానికి
Google తన యాడ్స్ ప్రోడక్ట్‌లను మెరుగుపరచడానికి లొకేషన్ సమాచారాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, మీ ఖాతాలో సేవ్ చేయబడిన సందర్భోచిత యాక్టివిటీ కోసం జనరల్ ఏరియాతో సహా మీరు ఇంటరాక్ట్ అయ్యే యాడ్స్ గురించిన డేటా సమగ్రపరచబడి, స్మార్ట్ బిడ్డింగ్ టూల్స్‌ను మెరుగుపరిచే మెషిన్ లెర్నింగ్ మోడల్‌లలో ఉపయోగించబడుతుంది. మీ ఖాతా డేటా అడ్వర్టయిజర్‌లకు షేర్ చేయబడదు.
యాడ్‌లను చూపడానికి నా లొకేషన్ సమాచారం ఎలా ఉపయోగించబడుతుంది అనేది నేను ఎలా కంట్రోల్ చేయగలను?
మీరు My Ad Centerలో Google ఉపయోగించిన ఏరియాల కంట్రోల్‌ను యాక్సెస్ చేయడం ద్వారా మీరు చూసే యాడ్‌లను ప్రభావితం చేయడానికి మీరు గతంలో Google Sites, అలాగే యాప్‌లను ఉపయోగించిన మీ సాధారణ ఏరియాలను ఎలా ఉపయోగించవచ్చు అనేది మీరు కంట్రోల్ చేయవచ్చు.
మీరు Googleను ఉపయోగించిన ప్రాంతాలను ఆన్ చేసినప్పుడు
యాడ్స్ వ్యక్తిగతీకరణ, అలాగే మీరు Googleను ఉపయోగించిన ఏరియాలు ఆన్ చేయబడినప్పుడు, మీ యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి మీరు Google Sites, ఇంకా యాప్‌లను ఉపయోగించిన జనరల్ ఏరియాలకు సంబంధించి మీ వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ చేయబడిన డేటాను Google ఉపయోగిస్తుంది.
మీరు Googleను ఉపయోగించిన ప్రాంతాలను ఆఫ్ చేసినప్పుడు
యాడ్స్ వ్యక్తిగతీకరణ, లేదా మీరు Googleను ఉపయోగించిన ఏరియాలు ఆఫ్ చేయబడినప్పుడు, మీ యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి మీరు Google Sites, ఇంకా యాప్‌లను ఉపయోగించిన జనరల్ ఏరియాలకు సంబంధించి మీ వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ చేయబడిన డేటాను Google ఉపయోగిస్తుంది. మీరు Googleను ఉపయోగించిన ప్రాంతాలు ఆఫ్ చేయబడినప్పటికీ, మీరు మీ Google ఖాతాలో మీ ప్రస్తుత లొకేషన్, అలాగే మీరు మీ ఇల్లు, ఇంకా ఆఫీస్‌గా సెట్ చేసిన స్థలాల ఆధారంగా యాడ్‌లు ఇప్పటికీ మీకు కనిపించవచ్చు.
అదనంగా, మీరు సైన్ అవుట్ చేసినట్లయితే, మీ పరికరం, అలాగే యాప్ సెట్టింగ్‌ల ఆధారంగా మీకు యాడ్‌లను చూపడానికి Google ఇప్పటికీ మీ IP అడ్రస్ లేదా మీ పరికరం నుండి మీ ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగించవచ్చు.
మీరు సైన్ అవుట్ చేసినప్పుడు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఎలా ఆన్, ఆఫ్ చేయాలనే దాని గురించి అదనపు సమాచారం కోసం, ఇక్కడ చూడండి.