గోప్యత గురించి మాకు ఎదురయ్యే కొన్ని ప్రధాన ప్రశ్నలకు ఇక్కడ మీరు సమాధానాలను పొందవచ్చు, అంటే డేటా అంటేఏమిటి? వంటివి. దానితో పాటు, మీరు మరింత తెలుసుకోవాలని అనుకుంటే గోప్యతా పాలసీని ఒకసారి చూడండి.
Googleలో మీ గోప్యత
మీ లొకేషన్
Googleకు నా లొకేషన్ తెలుస్తుందా?
మీరు ఇంటర్నెట్‌ను ఉపయోగించినప్పుడల్లా, యాప్‌లు, సైట్‌లు మీ లొకేషన్‌ను సుమారుగా అంచనా వేయగలుగుతాయి, ఇదే విషయం Googleకు కూడా వర్తిస్తుంది. మీ పరికర సెట్టింగ్‌లను బట్టి, Google మీ ఖచ్చితమైన లొకేషన్‌ను కూడా అంచనా వేయవచ్చు. (నా లొకేషన్ ఎంత ఖచ్చితంగా చూపుతోంది? చూడండి)
మీరు Googleలో, Search, Maps, లేదా Google Assistant వంటి వాటితో సెర్చ్ చేసినప్పుడు, మీకు మరింత సహాయకరమైన ఫలితాలను ఇవ్వడానికి మీ ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగించడం జరగవచ్చు. ఉదాహరణకు, మీరు రెస్టారెంట్‌ల కోసం సెర్చ్ చేసినట్లయితే, మీరు ఉన్న లొకేషన్‌కు సమీపంలో ఉన్న రెస్టారెంట్‌ల ఫలితాలే మీకు ఉపయోగకరమైనవి అయ్యే అవకాశం ఎక్కువ.
నేను లొకేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ ఎలా చేయాలి?
మీరు Googleలో సెర్చ్ చేసినప్పుడు, మీరు సెర్చ్ చేస్తున్న చోటులోని జనరల్ ఏరియాను Google ఎల్లప్పుడూ అంచనా వేస్తుంది. మీరు ఉపయోగించే, ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి పని చేసే ఏదైనా యాప్, లేదా వెబ్‌సైట్ లాగే, Google కూడా మీ పరికరం IP అడ్రస్ ఆధారంగా మీ లొకేషన్‌ను అంచనా వేస్తుంది. వివరంగా తెలుసుకోవడం కోసం, నేను ఎక్కడ ఉన్నానో Googleకు ఎలా తెలుస్తుంది? అనే అంశాన్ని చూడండి.
మీరు Googleను ఉపయోగించేటప్పుడు, మీ ఖచ్చితమైన లొకేషన్‌ను పంపించాలా వద్దా అనే దాని ఎంచుకునేందుకు, మీరు ఏవైనా యాప్‌లు, సైట్‌ల కోసం, లేదా మీ పరికరం కోసం లొకేషన్ అనుమతులను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.
మీరు మీ ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌లను సెట్ చేసి, మీరు ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉన్నారని Google అంచనా వేస్తే, అప్పుడు సరిగ్గా అదే అడ్రస్ మీ సెర్చ్ కోసం వాడబడుతుంది.
నా లొకేషన్ ఎంత మేరకు ఖచ్చితంగా ఉంది?
మీ జనరల్ ఏరియా
మీరు Googleలో సెర్చ్ చేసినప్పుడు, మీరు సెర్చ్ చేస్తున్న చోటులోని జనరల్ ఏరియాను Google ఎల్లప్పుడూ అంచనా వేస్తుంది. ఈ విధంగా Google మీకు సందర్భోచిత ఫలితాలను ఇవ్వగలదు, అలాగే ఒక కొత్త నగరం నుండి సైన్ ఇన్ చేయడం లాంటి అసాధారణ యాక్టివిటీని గుర్తించి మీ ఖాతాను సురక్షితంగా ఉంచగలదు.
జనరల్ ఏరియా అనేది 3 చద. కి.మీ. కన్నా పెద్దదిగా ఉంటుంది, కనీసం 1,000 యూజర్‌లను కలిగి ఉంటుంది. ఆ విధంగా మీ సెర్చ్ ద్వారా మిమ్మల్ని గుర్తించడం సాధ్యం కాదు, తద్వారా మీ గోప్యతను మీరు రక్షించుకోవడంలో సహాయం లభిస్తుంది.
మీ ఖచ్చితమైన లొకేషన్
మీరు అనుమతిస్తే, Google మీ ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించగలదు. ఉదాహరణకి, "నాకు దగ్గరలో ఐస్ క్రీం దొరికే చోటు" లేదా "స్టోర్‌కు మలుపు-తరువాత-మలుపు కాలినడక దిశలు" వంటి సెర్చ్‌లకు అత్యంత సందర్భోచితమైన ఫలితాలను అందించడానికి Googleకు మీ ఖచ్చితమైన లొకేషన్ అవసరం అవుతుంది.
ఖచ్చితమైన లొకేషన్‌కు అర్థం సరిగ్గా మీరు ఉన్న చోటు అని, అంటే ఒక నిర్దిష్టమైన అడ్రస్ వంటిది.
Googleకు నా లొకేషన్ ఎలా తెలుస్తుంది?
మీ లొకేషన్ వివిధ రకాల సోర్స్‌ల నుండి వస్తుంది, వాటన్నిటినీ కలిపి ఉపయోగించి మీరు ఉన్న చోటు అంచనా వేయబడుతుంది.
మీ పరికర IP అడ్రస్
IP అడ్రస్‌లు, ఫోన్ నంబర్‌ల ప్రాంతాల కోడ్‌ల లాగే, ఇంచుమించు భౌగోళిక లొకేషన్‌పై ఆధారపడి ఉంటాయి. అంటే google.comతో సహా, మీరు ఉపయోగించే ఏదైనా యాప్ లేదా వెబ్‌సైట్, మీ IP అడ్రస్ కారణంగా మీరు ఉన్న జనరల్ ఏరియాను అంచనా వేయగలదు. మీ పరికర IP అడ్రస్ మీ పరికరానికి మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కేటాయించినది, దాని కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
మీ పరికరం లొకేషన్
మీరు Google యాప్‌నకు గానీ, లేదా సైట్‌కు గానీ మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించడానికి అనుమతిని ఇస్తే, ఆ సమాచారం మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాదాపు పరికరాలన్నిటికీ వాటి ఆపరేటింగ్ సిస్టమ్ నిర్మాణంలో భాగంగా లొకేషన్ సెట్టింగ్‌లు ఉంటాయి. వీటిని సాధారణంగా సెట్టింగ్‌లలో చూడవచ్చు.
Googleలో మీ యాక్టివిటీ
మీ మునుపటి Google సెర్చ్‌ల ఆధారంగా మీ జనరల్ ఏరియాను Google అంచనా వేయగలదు. ఉదాహరణకు, మీరు తరుచుగా ముంబైలో పిజ్జా కోసం సెర్చ్ చేస్తే, మీరు ముంబై సంబంధిత ఫలితాలను చూడాలనుకునే అవకాశం ఉంది.
మీ లేబుల్ చేయబడిన స్థలాలు
మీరు మీ ఇంటి అడ్రస్‌ను కానీ లేదా ఆఫీస్ అడ్రస్‌ను కానీ సెట్ చేస్తే, మీరు ఎక్కడ ఉన్నారో అంచనా వేయడానికి Google వాటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ ఇంటి అడ్రస్‌ను సెట్ చేసి ఉండి, మీ IP అడ్రస్, మునుపటి యాక్టివిటీని లేదా ఇతర సోర్స్‌లు మీరు ఇంటికి దగ్గరలో ఉండవచ్చని సూచిస్తే, అప్పుడు మేము మీ ఇంటి లొకేషన్‌ను, మీరు ఎక్కడ ఉన్నారో తెలిపే అంచనాగా ఉపయోగిస్తాము.
నా లొకేషన్‌ను ఎవరు చూడగలరు?
అది మీ ఇష్టాన్ని బట్టి జరుగుతుంది. మీరు Google లొకేషన్ షేరింగ్‌ను ఉపయోగిస్తే మీ రియల్-టైమ్ లొకేషన్‌ను, ఫ్రెండ్స్‌తోనూ, ఫ్యామిలీతోనూ Google యాప్‌లు సైట్‌లన్నిటా షేర్ చేయవచ్చు.
మీరు మీ లొకేషన్‌ను షేర్ చేస్తున్నారేమో చెక్ చేసుకోండి
లొకేషన్ షేరింగ్ ఆటోమేటిక్‌గా ఆఫ్‌లో ఉంది. మీరు మీ రియల్ టైమ్ లొకేషన్‌ను షేర్ చేయాలనుకుంటే, ఎవరితో, ఎంత సమయం పాటు షేర్ చేయాలనుకుంటున్నారో ఎంచుకొని, నిర్ధారించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనాసరే మీ లొకేషన్‌ను షేర్ చేయడం ఆపివేయవచ్చు.
మీ రియల్ టైమ్ లొకేషన్‌ను ఇతరులతో షేర్ చేయడాన్ని గురించి చూడండి.
Googleలో షేర్ చేయడం
నేను Googleలో షేర్ చేసినప్పుడు ఇతర వ్యక్తులు వేటిని చూడగలుతారు?
ఇతర వ్యక్తులు మీ గురించి Google యాప్‌లు, సైట్‌లలో ఏమి చేస్తారనేది, మీరు ఏ విధంగా షేర్ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది:
పబ్లిక్‌గా షేర్ చేయడం
మీరు Google Maps వంటి యాప్‌లకు కంట్రిబ్యూట్ చేస్తే, ఇతరులు మీ పేరును, ఫోటోను చూడగలుగుతారు. ఉదాహరణకు, మీరు మీకు ఎంతో ఇష్టమయిన ఐస్ క్రీమ్ స్టోర్‌ను రేట్ చేస్తే, ఇతరులు మీ రేటింగ్‌ను, పేరును, ఫోటోను, వారు ఆ స్టోర్‌ను Google Mapsలో అన్వేషించినప్పుడు చూడగలుగుతారు.
ప్రైవేట్‌గా షేర్ చేయడం
మీరు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను ఇతరులతో షేర్ చేస్తే, వాటిని ఎవరికైతే పంపుతున్నారో ఆ వ్యక్తి మీరు పంపే వాటితో పాటు మీ పేరును, ఫోటోను కూడా చూడగలుగుతారు.
ఇతరులతో షేర్ చేసే ముందు మీరు వారికి ఏ స్థాయిలో యాక్సెస్ ఇస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించండి. ఉదాహరణకు, Google Driveలోని ఫోల్డర్లు, లేదా Google Photosలోని ఆల్బమ్‌ల వంటి వాటికి యాక్సెస్‌ను షేర్ చేస్తున్నప్పుడు, మీరు జోడించే కొత్త కంటెంట్‌కు కూడా వారి యాక్సెస్ కొనసాగవచ్చు.
నేను షేర్ చేసే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి వాటిని ఎవరు చూడగలుగుతారు?
మీరు ఉపయోగించే Google యాప్‌లలో, సైట్‌లలో నిర్దిష్ట కంటెంట్‌ను ఇతర వ్యక్తులతో షేర్ చేయడానికి మీరు ఎంచుకోవచ్చు.
మీరు షేర్ చేసినప్పుడు, యాప్‌లలోను, ఇంకా Googleకు వెలుపల ఉన్న సైట్‌లలో కూడా ఇతర వ్యక్తులు మళ్లీ షేర్ చేసే అవకాశం ఉందని మర్చిపోవద్దు.
మీరు మీ ఖాతా నుండి మీ స్వంత కంటెంట్‌ను ఎప్పుడైనా తొలగించవచ్చు, కానీ మీరు ఇప్పటికే షేర్ చేసిన కాపీలను ఇది తొలగించదు.
మీరు షేర్ చేసే వాటి గురించి కొంచెం ఆలోచించండి, మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే షేర్ చేయండి.
Google నా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడైనా ఇతరులతో షేర్ చేస్తుందా?
చాలా తక్కువ సందర్భాలలో, చట్టపరమైన అవసరాలు ఉంటే తప్ప, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని Google వెలుపలి కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో షేర్ చేయము.
మీ స్కూల్ ద్వారా మీకు Google ఖాతా (Google Workspace for Education ఖాతా) ఉంటే, మీ ఖాతాను నిర్వహించే స్కూల్ అడ్మినిస్ట్రేటర్ మీ సమాచారానికి యాక్సెస్‌ను కలిగి ఉంటారు.
స్కూల్ అడ్మిన్ల ద్వారా యాక్సెస్
మీ స్కూల్ అడ్మిన్ మీ Google Workspace for Education ఖాతాలోని కింది సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగే అవకాశం ఉంది:
- మీ ఖాతాలో స్టోర్ చేసి ఉన్న సమాచారాన్ని, అంటే మీ ఇమెయిల్ వంటి వాటిని యాక్సెస్ చేసి నిల్వను కొనసాగించగలరు
- మీ ఖాతాకు సంబంధించిన గణాంకాలను, అంటే మీరు ఇన్స్టాల్ చేసిన యాప్‌ల సంఖ్య వంటి వాటిని చూడగలుగుతారు
- మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చగలుగుతారు
- మీ ఖాతా యాక్సెస్‌ను సస్పెండ్ లేదా ముగించగలరు
- వర్తించే చట్టం, నిబంధన, చట్టపరమైన ప్రక్రియ లేదా అమలు చేయదగిన ప్రభుత్వపరమైన రిక్వెస్ట్‌ను పూర్తి చేయడానికి మీ ఖాతా సమాచారాన్ని పొందవచ్చు
- మీ సమాచారాన్ని లేదా గోప్యతా సెట్టింగ్‌లను తొలగించగల లేదా ఎడిట్ చేయగల మీ సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు
Google మీ సమాచారాన్ని ఎందుకు షేర్ చేయవచ్చు
మీరు మాకు అనుమతిని ఇచ్చినప్పుడు
ఉదాహరణకు, పిజ్జాను ఆర్డర్ చేయడానికి మీరు Google Assistantను ఉపయోగిస్తే, రెస్టారెంట్‌తో మీ పేరును లేదా ఫోన్ నంబర్‌ను షేర్ చేసేముందు మేము మీ అనుమతిని పొందుతాము. థర్డ్ పార్టీ యాప్‌లు & సర్వీస్‌లతో డేటాను సురక్షితంగా షేర్ చేయడంలో Google ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
డొమైన్ అడ్మినిస్ట్రేటర్లతో, పైన పేర్కొన్న విధంగా.
వెలుపలి ప్రాసెసింగ్ కోసం: మేము అందించే సూచనల ఆధారంగా డేటాను ప్రాసెస్ చేయడం కోసం, మేము కలసి పనిచేసే కంపెనీలకు సమాచారాన్ని అందిస్తాము. ఉదాహరణకు, మేము బయటి కంపెనీలను, మాకు కస్టమర్ సపోర్ట్ విషయంలో సహాయం చేయడానికి ఉపయోగించుకుంటాము. అటువంటప్పుడు యూజర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, ఆ కంపెనీతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవలసి వస్తుంది.
చట్టపరమైన కారణాల కోసం
వ్యక్తిగత సమాచారాన్ని అందించడం ఇందు కోసం అవసరం కావచ్చని మేము నమ్మినప్పుడు దానిని Google వెలుపల షేర్ చేస్తాము:
- వర్తించే చట్టం, నిబంధన, చట్టపరమైన ప్రక్రియ లేదా అమలు చేయదగిన ప్రభుత్వపరమైన రిక్వెస్ట్‌ను పూర్తి చేయడానికి.
- ఉల్లంఘనకు అవకాశం ఉన్న వాటి విచారణలతో సహా, వర్తించే సర్వీస్ నియమాల అమలు కోసం.
- మోసం, భద్రత లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడం, నివారించడం లేదా పరిష్కరించడం కోసం.
- చట్టప్రకారం అవసరమైన లేదా అనుమతించబడిన మేరకు, Googleకు, మా యూజర్లకు లేదా పబ్లిక్కు చెందిన హక్కులు, ప్రాపర్టీ లేదా భద్రతకు జరిగే హానిని నివారించడం కోసం.
డేటా & వ్యక్తిగతీకరణ
నా గురించి Google ఏ డేటాను సేకరిస్తుంది?
మీరు Google యాప్‌లను, సైట్‌లను ఉపయోగించినప్పుడు; మీకు వాటిని అందించడానికి, అవి మీకు మరింత ఉపయోగపడేలా తయారు చేయడానికి, Google డేటాను ఎందుకు సేకరిస్తుంది?లో వివరించిన మరిన్ని కారణాల కోసం కూడా మేము అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము.
మీ సెట్టింగ్‌లతో, మేము సేకరించే డేటాతో పాటు, ఆ డేటా ఎలా ఉపయోగించాలనే దానిని మీరు పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మీ Google ఖాతాకు మీ YouTube హిస్టరీని సేవ్ చేయకూడదని భావిస్తే, మీరు YouTube హిస్టరీని ఆఫ్ చేయవచ్చు. Google వేటివేటిని సేవ్ చేయాలనేది నేను ఎలా నిర్ణయించవచ్చు? చూడండి
డేటా అంటే ఏమిటి?
మీ వ్యక్తిగత సమాచారంలో, మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా గుర్తించగలిగే అంశాలను మీరు మాకు అందిస్తారు, అంటే మీ పేరు, ఇమెయిల్ అడ్రస్ వంటివి. వీటిలో భాగంగా Google మీకు సంబంధించినదిగా లింక్ చేయగల డేటా కూడా ఉంటుంది, అంటే మీ Google ఖాతాలో మేము మీతో అనుబంధితం చేసే సమాచారం వంటిది.
మీ వ్యక్తిగత సమాచారంలో రెండు రకాల అంశాలు ఉంటాయి:
మీరు అందించేవి లేదా క్రియేట్ చేసేవి
మీరు Google ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, మీ పేరు, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని మాకు అందిస్తారు.
అంతే కాకుండా మీరు కంటెంట్‌ను సేవ్ చేయడం, అప్‌లోడ్ చేయడం లేదా ఇతరుల నుండి అందుకోవడం, చేయవచ్చు, అంటే ఇమెయిల్, మెసేజ్‌లు, ఫోటోల వంటివి.
Googleను ఉపయోగించి మీరు చేసేవి
మా సర్వీస్‌లలో మీ యాక్టివిటీని గురించిన సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఇందులో మీ సెర్చ్ క్వెరీలు, మీరు చూసే వీడియోలు, మీరు కమ్యూనికేట్ చేసే లేదా కంటెంట్‌ని షేర్ చేసే వ్యక్తులు, మీ Chrome బ్రౌజింగ్ హిస్టరీ వంటివి కూడా భాగంగా ఉండవచ్చు. ఫలితంగా మీరు మెరుగైన అనుభవాన్ని పొందగలుగుతారు.
Google సర్వీస్‌లను యాక్సెస్ చేయడం కోసం మీరు ఉపయోగించే యాప్‌లు, బ్రౌజర్‌లు, పరికరాల గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. మీ బ్యాటరీ శాతం తక్కువగా ఉన్నప్పుడు స్క్రీన్‌లో కాంతి తగ్గించడం వంటి ఫీచర్‌లను అందించడంలో ఇది మాకు సహాయపడుతుంది.
మేము మీ లొకేషన్‌ను ప్రాసెస్ చేస్తాము, ఉదాహరణకు, మీరు మలుపు-తరువాత-మలుపు వంటి ఫీచర్‌లను ఉపయోగించే సందర్భాలలో. మరిన్ని వివరాల కోసం లొకేషన్ విభాగాన్ని చూడండి.
Google డేటాను ఎందుకు సేకరిస్తుంది?
మా సర్వీస్‌లను మీకు అందించడానికి, అవి మీకు మరింత బాగా ఉపయోగపడేలా వాటిని తయారుచేయడానికి, మేము మాకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. 'మేము డేటాను ఉపయోగించే పద్ధతులు'లో వివరించిన విధంగా, ఇతర కారణాల కోసం కూడా డేటాను ఉపయోగిస్తాము.
ఉదాహరణకు, మీరు వెళ్లే చోటుకి ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ వెళ్లడంలో Google Maps మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇది మీరు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని (మీ డేటా) పబ్లిక్ డేటాతో (మ్యాప్‌లు, పబ్లిక్ ప్రదేశాల సమాచారం) అనుసంధానం చేస్తుంది.
మేము డేటాను ఉపయోగించే విధానాలు
మా సర్వీస్‌లను అందించడానికి
మేము డేటాను మా సర్వీస్‌లను అందించడానికి ఉపయోగిస్తాము, అంటే ఫలితాలను అందించడం కోసం మీరు సెర్చ్ చేసే క్వెరీలను ప్రాసెస్ చేయడం వంటివి.
మా సర్వీస్‌లను నిర్వహించడానికి, మెరుగుపరచడానికి
డేటా అనేది మా సర్వీస్‌లను నిర్వహించడానికి, మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మేము అవుటేజ్‌లను ట్రాక్ చేయగలుగుతాం. అంతే కాకుండా, ఏ సెర్చ్ క్వెరీకి ఎక్కువగా అక్షరదోషాలు ఉన్నాయో అర్థం చేసుకోవడం మా సర్వీస్‌లలో ఉపయోగించే స్పెల్-చెక్ ఫీచర్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొత్త సర్వీస్‌లను డెవలప్ చేయడానికి
డేటా మాకు కొత్త సర్వీస్‌లను డెవలప్ చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, వ్యక్తులు Google మొదటి ఫోటోల యాప్ అయిన Picasaలో తమ ఫోటోలను ఏ విధంగా క్రమంలో పెట్టుకున్నారో అర్థం చేసుకోవడం అనేది, Google Photosను డిజైన్ చేయడంలోనూ లాంచ్ చేయడంలోనూ మాకు సహాయపడింది.
కంటెంట్, అలాగే యాడ్‌లతో సహా వ్యక్తిగతీకరించిన సర్వీస్‌లను, అందించడానికి
మేము డేటాను వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను అందించడానికి ఉపయోగిస్తాము, ఉదాహరణకు మీకు నచ్చే అవకాశం ఉన్న వీడియోలను సిఫార్సు చేయడం వంటి వాటికి. మీ సెట్టింగ్‌లను బట్టి, మీ వయస్సును బట్టి, మీ ఆసక్తులను అనుసరించి మేము మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపించవచ్చు.
పనితీరుని అంచనా వేయడానికి
మేము మా సర్వీస్‌ల పనితీరును అంచనా వేయడానికి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకోవడానికి కూడా డేటాను ఉపయోగిస్తాము
మీతో కమ్యూనికేట్ చేయడానికి
ఒకవేళ మేము అనుమానాస్పదంగా ఉన్న యాక్టివిటీని గుర్తిస్తే, మీకు నోటిఫికేషన్ పంపడానికి మీ ఇమెయిల్ అడ్రస్‌ను మేము ఉపయోగించవచ్చు
Googleను, మా యూజర్‌లను, పబ్లిక్‌ను సంరక్షించడానికి
ఆన్‌లైన్‌లో వ్యక్తులను మరింత సురక్షితంగా ఉంచడానికి మేము డేటాను ఉపయోగిస్తాము, అంటే మోసాన్ని గుర్తించడం, దానిని నివారించడం వంటివి
వివిధ అంశాలను వ్యక్తిగతీకరించడానికి Google డేటాను ఏ విధంగా ఉపయోగిస్తుంది?
“వ్యక్తిగతీకరించడం” అంటే మేము సేకరించిన సమాచారాన్ని, మా యాప్‌లు, సైట్‌లను మీకు తగిన విధంగా మలచడం కోసం ఉపయోగించడమే. ఉదాహరణకు:
- మీకు నచ్చే అవకాశం ఉన్న వీడియోల సిఫార్సులు చేయడం
- మీరు Google యాప్‌లు, సైట్‌లను ఎలా ఉపయోగిస్తారనే దానికి అనుగుణంగా తగిన సెక్యూరిటీ చిట్కాలను రూపొందించడం (సెక్యూరిటీ చెకప్‌ను చూడండి)
మేము డేటాను, యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి కూడా ఉపయోగిస్తాము. సెట్టింగ్‌లు ఆఫ్‌లో ఉండడం, నిర్దిష్ట వయస్సు వంటి అంశాలలో ఇందుకు మినహాయింపు ఉంటుంది.
నేను చూసే యాడ్‌లను Google వ్యక్తిగతీకరిస్తుందా?
మేము చూపించే యాడ్‌లు సాధ్యమైనంత వరకూ ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి మేము ట్రై చేస్తాము. కానీ నిర్దిష్ట వయస్సు ఉన్న వారికి, యాడ్ వ్యక్తిగతీకరణను ఆఫ్ చేసిన వారికీ మేము యాడ్‌లను వ్యక్తిగతీకరించము.
వ్యక్తిగతీకరించక పోయినా కూడా అప్పటికీ మేము యాడ్‌లను ఉపయోగకరంగా ఉండేలా చూడగలము. ఉదాహరణకు, మీరు "కొత్త షూస్" అనే పేజీ ఫలితాల కోసం చూస్తున్నట్లయితే, మీరు స్నీకర్ కంపెనీ నుండి యాడ్‌ను చూడవచ్చు. యాడ్‌లను అవి రోజులోని సమయం, మీ సాధారణ లొకేషన్, మీరు చూస్తున్న పేజీ తాలూకు కంటెంట్ వంటి సాధారణ అంశాల ఆధారంగా అందించడం జరగవచ్చు.
కంట్రోల్ మీ చేతుల్లో ఉంది
Google నా ఖాతాకు వేటిని సేవ్ చేయాలో నేను ఎలా నిర్ణయించగలుగుతాను?
మీరు Photos వంటి Google సర్వీస్‌ను ఉపయోగిస్తున్నప్పడు, మీరు మీ ఫోటోలను బ్యాకప్ చేసి సింక్ చేయాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని నిర్ణయించడానికి వీలు కల్పించే సెట్టింగ్‌లు ఉన్నాయి.
Google యాప్‌లు సైట్‌లన్నిటా మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి సహాయపడే సెట్టింగ్‌లు కూడా ఉన్నాయి. వాటిలో కీలకమైనవి రెండు, వెబ్ & యాప్ యాక్టివిటీ, ఇంకా YouTube హిస్టరీ.
ఈ కంట్రోల్స్ ఆన్‌లో ఉన్నప్పుడు:
- Google యాప్‌లు, సైట్‌లలోని మీ యాక్టివిటీని గురించిన సమాచారం మీ Google ఖాతాలో సేవ్ చేయబడుతుంది. అంతేకాకుండా
- సేవ్ చేయబడిన సమాచారం మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఉపయోగపడుతుంది
వెబ్ & యాప్ యాక్టివిటీ
Google సైట్‌లలో, ఇంకా Search, Maps లాంటి యాప్‌లలో మీ యాక్టివిటీని సేవ్ చేస్తుంది, ఇందులో లొకేషన్ లాంటి అనుబంధిత సమాచారం కూడా ఉంటుంది. Google సర్వీస్‌లను ఉపయోగించే సైట్‌లు, యాప్‌లు, పరికరాల నుండి సింక్ చేసిన Chrome హిస్టరీ, యాక్టివిటీని కూడా ఇది సేవ్ చేస్తుంది.
Maps, Search, ఇంకా ఇతర Google సర్వీస్‌లలో మీకు వేగవంతమైన సెర్చ్‌లు, మెరుగైన సిఫార్సులు, అలాగే మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాలను అందించడం కోసం మీ యాక్టివిటీని ఉపయోగించడం జరుగుతుంది.
YouTube హిస్టరీ
YouTubeను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు చూసే వీడియోలను, మీరు సెర్చ్ చేసే అంశాలను సేవ్ చేస్తుంది.
మీ YouTube హిస్టరీ, మీ YouTube అనుభవాన్ని, ఇతర యాప్‌లను, వ్యక్తిగతీకరించడానికి, మీ సెర్చ్ ఫలితాల మాదిరిగానే ఉపయోగించబడుతుంది.
నేను నా యాక్టివిటీ డేటాను ఎలా తొలగించాలి?
మీరు మీ Google ఖాతాలో సేవ్ చేసిన డేటాను తొలగించవచ్చు. మీరు శాశ్వతంగా తొలగించాలనుకొనే డేటా మా సిస్టమ్‌ల నుండి తీసివేయబడుతుంది. మేము ఈ డేటాను మా సర్వర్‌ల నుండి పూర్తిగా తీసివేయబడేలా చూడడానికి తగిన జాగ్రత్తలతో కూడిన ప్రాసెస్‌ను అనుసరిస్తాము లేదా మీతో ఏ విధంగానూ అనుబంధితం కాని రూపంలో మాత్రమే దాన్ని ఉంచేలా జాగ్రత్త తీసుకుంటాము.
నా యాక్టివిటీకి వెళ్లి, మీ Google ఖాతాలో సేవ్ చేసిన యాక్టివిటీని, అంటే మీరు సెర్చ్ చేసిన లేదా చూసిన అంశాల వంటి వాటిని రివ్యూ చేయండి. మీరు నిర్దిష్టంగా ఒక యాక్టివిటీని గాని, లేదా నిర్దిష్ట సమయ పరిధిలోని మీ యాక్టివిటీ అంతటినీ గాని తొలగించవచ్చు.
మీ యాక్టివిటీ ఆటోమేటిక్‌గా తొలగించబడేలా కూడా మీరు ఎంచుకోవచ్చు.
నా కంటెంట్‌ను నేను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
మీ కంటెంట్‌లో ఇమెయిల్‌లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ షీట్‌లు, కామెంట్‌లు, కాంటాక్ట్‌లు, క్యాలెండర్ ఈవెంట్‌ల వంటి అంశాలు ఉంటాయి.
మీ కంటెంట్ ఆర్కైవ్‌ను క్రియేట్ చేయడానికి 'మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి'కి వెళ్లండి — తద్వారా మీరు దానిని బ్యాకప్ చేయడం లేదా భిన్నమైన సర్వీస్‌ను ట్రై చేయాలనుకుంటే, దానిని మరొక కంపెనీకి తీసుకువెళ్లడం చేయవచ్చు.
నేను సైన్ అవుట్ చేశాక కూడా ఎటువంటి కంట్రోల్స్‌ను కలిగి ఉంటాను?
మీరు సైన్ అవుట్ అయ్యి ఉన్నప్పుడు కూడా, Googleను ఎలా ఉపయోగించాలో ఎంచుకొనే వీలు కల్పించే కంట్రోల్స్ మీకు ఉన్నాయి. మీరు సైన్ అవుట్ అయ్యి ఉన్నప్పుడు ఈ సెట్టింగ్‌లను మార్చడానికి, g.co/privacytools కు వెళ్లండి:
సెర్చ్ అనుకూలీకరణ
ఈ బ్రౌజర్ నుండి Google మీ సెర్చ్‌లను మరింత సందర్భోచితమైన ఫలితాలు, సిఫార్సుల కోసం ఉపయోగిస్తుంది.
YouTube సెర్చ్, వీక్షణ హిస్టరీ
YouTubeను మీ కోసం వ్యక్తిగతీకరించడానికి, వీడియోలు, మీరు సెర్చ్ చేసే అంశాల వంటి మీ YouTube యాక్టివిటీని ఉపయోగిస్తుంది.
మీరు మీ బ్రౌజర్‌లో కొన్ని, లేదా అన్ని కుక్కీలనూ బ్లాక్ చేయవచ్చు. కానీ దీని వలన వెబ్ అంతటా కొన్ని ఫీచర్‌లు పనిచేయడం ఆగిపోవచ్చు. ఉదాహరణకు, మీరు సైన్ ఇన్ చేయాలనుకున్నప్పుడు, అనేక వెబ్‌సైట్‌లకు కుక్కీలు ఆన్‌లో ఉండాలి.
సైన్ అవుట్ చేసిన యూజర్‌లు కూడా వారు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూడాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని ఎంచుకోవచ్చు, అయితే మేము నిర్దిష్ట వయస్సు ఉన్న వారి విషయంలో వ్యక్తిగతీకరించడం అనేది చేయము.