మేము ఎందుకు వ్యాపార ప్రకటనలనే విక్రయిస్తాము, శోధన ఫలితాలను ఎందుకు విక్రయించము.
ప్రతిదీ అమ్మకానికి ఉండే ఈ ప్రపంచంలో, ప్రకటనదారులు మా శోధన ఫలితాల్లో మెరుగైన స్థానాన్ని ఎందుకు కొనుగోలు చేయలేరు?
సమాధానం చాలా సులభం. మీరు Googleని ఉపయోగించి కనుగొనే వాటి పట్ల నమ్మకంగా ఉండగలగాలని మా భావన. మొదటి నుండి, మా వినియోగదారులకు అత్యంత సందర్భోచిత సమాధానాలు మరియు ఫలితాలను అందించడమే మేము శోధన పట్ల అవలంబించే విధానం ముఖ్యోద్దేశం.
Google శోధన ఫలితాల్లో చూపడానికి ఎవరు వెబ్ పేజీకి లింక్ చేస్తున్నారు అలాగే ఆ పేజీలోని కంటెంట్ మీ శోధనకు ఎంత మేరకు సంబంధితంగా ఉందనే అంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి. ఆన్లైన్ సంఘం ముఖ్యమని విశ్వసించేవే మా ఫలితాల్లో చూపబడతాయి, అంతేకానీ మేము లేదా మా భాగస్వాములు మీకు చూపాలని కోరుకునేవి కావు.
సందర్భోచిత ప్రకటనలు వాస్తవ శోధన ఫలితాల వలె ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మేము నమ్ముతాము, అయినప్పటికీ వినియోగదారులు ఎవరూ ఏది దేనికి సంబంధించినదో తెలుసుకోవడంలో గందరగోళానికి గురి కాకూడదని మేము కోరుకుంటున్నాము.
Googleలో ప్రతి ప్రకటన స్పష్టంగా గుర్తు పెట్టబడుతుంది మరియు వాస్తవ శోధన ఫలితాల నుండి వేరుగా ఉంచబడుతుంది. ప్రకటనదారులు ఎక్కువ చెల్లించడం ద్వారా వ్యాపార ప్రకటనల ప్రాంతంలో పెద్ద పరిమాణంలో ప్రదర్శించగలిగినప్పటికీ, శోధన ఫలితాల్లో ఎవరూ తమకు తాము మెరుగైన స్థానాన్ని కొనుగోలు చేయలేరు. అలాగే, మీరు నమోదు చేసిన శోధన పదాలకు సంబంధితంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రకటనలు ప్రదర్శించబడతాయి. కనుక, సాధారణంగా మీకు ఉపయోగకరమైన ప్రకటనలు మాత్రమే కనిపిస్తాయి.
శోధన ఫలితాలు మరియు వ్యాపార ప్రకటనలను విడివిడిగా చూపడం ఎంతో ముఖ్యమనే విషయం పట్ల కొన్ని ఆన్లైన్ సేవలకు అంత విశ్వాసం ఉండదు.
కానీ మేము విశ్వసిస్తున్నాము.