గోప్యతా ప్రకటన

మీరు కానీ, లేదా మీ ఎండ్ యూజర్‌లు కానీ Read Alongను Google Workspace for Education ఖాతా ద్వారా యాక్సెస్ చేస్తున్నట్లయితే, ఈ గోప్యతా ప్రకటన వర్తించదు. ఈ సందర్భంలో, Google Workspace for Education గోప్యతా ప్రకటన కానీ, లేదా ఏ ఇతర ఒప్పందం కింద అయితే Google Workspace for Educationను అందించడానికి Google అంగీకరించిందో, ఆ ఒప్పందం కానీ, మీ Read Along వినియోగానికి వర్తిస్తుంది.

Read Along ఏ డేటాను కలెక్ట్ చేస్తుంది, దాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము అనే విషయాలను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులకు సహాయం చేయడం ఈ Read Along గోప్యతా ప్రకటన ఉద్దేశం.  ఈ నోటీసు Read Alongకు ప్రత్యేకంగా వర్తించే మా గోప్యతా పద్ధతులకు సంబంధించిన సమాచారాన్ని, Google గోప్యతా పాలసీలో అత్యంత సందర్భోచితంగా ఉండే భాగాల సారాంశాన్ని అందిస్తుంది.

Read Along సర్వీస్‌ను సైన్ ఇన్ చేసి ఉపయోగించవచ్చు, సైన్ ఇన్ చేయకుండా కూడా ఉపయోగించవచ్చు. సైన్ ఇన్ చేసినప్పుడు, యూజర్ వారి Google ఖాతా ద్వారా సైన్ ఇన్ చేస్తారు, వారి హిస్టరీ, ప్రాధాన్యతలు ఖాతాలో సేవ్ అవుతాయి, తద్వారా వారు సింపుల్‌గా లాగిన్ చేసి, ఏ పరికరంలోనైనా సర్వీస్‌ను ఉపయోగించవచ్చు. సైన్ అవుట్ చేసినప్పుడు, సైన్ ఇన్ చేయడానికి యూజర్ Google ఖాతాను ఉపయోగించాల్సిన అవసరం లేదు, కానీ వారి హిస్టరీ, ప్రాధాన్యతలు పరికరంలోనే సేవ్ అవుతాయి.

సైన్ ఇన్ చేసి వినియోగించగల సర్వీస్, వెబ్ యూజర్‌లతో పాటు Android యాప్ యూజర్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది, కానీ సైన్ అవుట్ చేసి వినియోగించగల సర్వీస్ Android యాప్‌లో, ప్రస్తుత యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మేము కలెక్ట్ చేసే సమాచారం

మీరు Read Alongను ఉపయోగించేటప్పుడు, మీ చిన్నారి వినియోగం ప్రకారం (ఉదాహరణకు, వారు పుస్తకాన్ని చదువుతున్నప్పుడు) Google సమాచారాన్ని కలెక్ట్ చేస్తుంది. ఈ సమాచారంలో ఈ కింది అంశాలు ఉంటాయి:

సైన్ ఇన్ చేసి వినియోగించగల సర్వీస్‌గా Read Alongను ఉపయోగిస్తున్నప్పుడు:

సైన్ అవుట్ చేసి వినియోగించగల సర్వీస్‌గా Read Alongను ఉపయోగిస్తున్నప్పుడు:

Read Alongకు సంబంధించి, సైన్ ఇన్ చేసి వినియోగించగల సర్వీస్‌తో పాటు, సైన్ అవుట్ చేసి వినియోగించగల సర్వీస్ కూడా వాయిస్ డేటాను కలెక్ట్ చేస్తుంది. వాయిస్ డేటా యూజర్ పరికరంలో మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది, అలాగే యూజర్‌ల గోప్యతను రక్షించడానికి ఇది Googleతో షేర్ చేయబడదు. ప్రాసెసింగ్ అయిన తర్వాత వాయిస్ డేటా అస్సలు స్టోర్ చేయబడదు.

Read Alongకు సంబంధించి, సైన్ ఇన్ చేసి వినియోగించగల సర్వీస్‌తో పాటు, సైన్ అవుట్ చేసి వినియోగించగల సర్వీస్ కూడా యూజర్‌లకు, వారి చిన్నారులకు వేర్వేరు ప్రొఫైల్స్‌ను సెటప్ చేయడానికి, అందించబడిన అనేక అవతార్‌ల నుండి వారికి నచ్చిన దాన్ని ఎంచుకోవడానికి, వారి ప్రొఫైల్‌కు ఒక పేరును సెట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

మేము కలెక్ట్ చేసే సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

యాప్‌లో కానీ లేదా వెబ్‌లో కానీ Read Alongను ఉపయోగించే సమయంలో, మీ చిన్నారి ఒక సెషన్ నుండి మరొక సెషన్‌కు ముందుకు సాగేటప్పుడు, నిరంతరంగా పురోగతి సాగించే అవకాశం వారికి కల్పించడానికి గాను, పైన వివరించబడిన సమాచారాన్ని Google కలెక్ట్ చేస్తుంది. దీని ద్వారా మీ చిన్నారి మునుపటి రీడింగ్ హిస్టరీని చూడవచ్చు, ఇంకా మీ చిన్నారి గెలుచుకున్న యాప్‌లో రివార్డ్‌లను ట్రాక్ చేయవచ్చు. మీ చిన్నారి ఆసక్తులకు, రీడింగ్ లెవెల్‌కు మ్యాచ్ అయ్యే పుస్తకాలను సిఫార్సు చేయడానికి మునుపటి రీడింగ్ హిస్టరీ ఉపయోగించబడుతుంది. మీ చిన్నారి నెలలు, లేదా సంవత్సరాల పాటు వారి రీడింగ్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకొనేటప్పుడు, వారి రీడింగ్ జర్నీకి సపోర్ట్ చేయడానికి ఈ సమాచారం అవసరం.

Read Alongకు సంబంధించి, సైన్ ఇన్ చేసి వినియోగించగల వెర్షన్‌ను కానీ, లేదా సైన్ అవుట్ చేసి వినియోగించగల వెర్షన్‌ను కానీ ఉపయోగించేటప్పుడు, దిగువున వివరించిన విధంగా టీచర్‌లతో, లేదా అడ్మిన్‌లతో షేర్ చేయడం మినహా, వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్-పార్టీలతో షేర్ చేయడానికి లేదా పబ్లిక్‌గా అందుబాటులో ఉంచడానికి Google, మీ చిన్నారులను అనుమతించదు.

స్పామ్‌ను నిరోధించడం, దుర్వినియోగాన్ని నిరోధించడం, కంటెంట్ లైసెన్స్ పరిమితులను అమలు చేయడం, ప్రాధాన్య భాషను నిర్ధారించడం, అప్లికేషన్‌కు సంబంధించి, సైన్ ఇన్ చేసి ఉపయోగించగల, సైన్ అవుట్ చేసి ఉపయోగించగల వెర్షన్‌ల వినియోగాన్ని విశ్లేషించడం, సర్వీస్‌ను అందించడం, మేనేజ్ చేయడం, ఇంకా మెరుగుపరచడం వంటి అంతర్గత నిర్వహణ అవసరాల కోసం కూడా, కలెక్ట్ చేసిన సమాచారాన్ని Google ఉపయోగిస్తుంది.

Read Alongకు సంబంధించి, సైన్ ఇన్ చేసి వినియోగించగల వెర్షన్‌ను ఉపయోగించేటప్పుడు, టీచర్‌లకు, అడ్మిన్‌లకు గ్రూప్‌లను క్రియేట్ చేయడానికి Google ఒక మెకానిజమ్‌ను కూడా అందిస్తుంది, ఈ గ్రూప్‌ల ద్వారా ఒకేసారి ఒకరి కంటే ఎక్కువ మంది చిన్నారులు, వారు ఏ పుస్తకాలను చదువుతున్నారు, ఎంత బాగా చదువుతున్నారు, మొత్తంగా ఎన్ని నిమిషాల పాటు చదువుతున్నారు, అలాగే యాప్‌లో వారి పేరుకు సంబంధించిన సమాచారాన్ని వారి టీచర్‌తో షేర్ చేయగలరు. దీని ద్వారా, క్రమం తప్పకుండా చదవడాన్ని ప్రాక్టీస్ చేయడానికి మీ చిన్నారిని, గ్రూప్‌లోని ఇతర చిన్నారులను గైడ్ చేసే అవకాశం టీచర్‌కు దక్కుతుంది.

Read Alongకు సంబంధించి, సైన్ అవుట్ చేసి వినియోగించగల వెర్షన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీ పరికరంలో స్టోర్ అయిన, Read Along కలెక్ట్ చేసిన ఏ డేటాను అయినా మీరు రివ్యూ చేయాలనుకుంటే మరియు/లేదా తొలగించాలనుకుంటే, Read Along యాప్‌ను తొలగించడం ద్వారా, లేదా మీ పరికర ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన అప్లికేషన్ డేటా తొలగింపు ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా అలా చేయవచ్చు.

Read Alongకు సంబంధించి, సైన్ ఇన్ చేసి వినియోగించగల వెర్షన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీ ఖాతా ఐడెంటిఫయర్‌తో అనుబంధించబడి సర్వర్‌లో స్టోర్ అయ్యి ఉండే, Read Along కలెక్ట్ చేసిన ఏ డేటాను అయినా మీరు తొలగించాలనుకుంటే, యాప్‌లో ఎడమ వైపు ఉండే నావిగేషన్ మెనూలోని "హిస్టరీని తొలగించండి" బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా అలా చేయవచ్చు. మీ Google ఖాతా అంతటినీ మీరు తొలగిస్తే, సైన్ ఇన్ చేసి వినియోగించగల వెర్షన్ నుండి కూడా ఈ డేటా తొలగించబడుతుంది.

మేము షేర్ చేసే సమాచారం

ఈ కింది సందర్భాల్లో తప్ప, వ్యక్తిగత సమాచారాన్ని Googleలో భాగం కాని ఎక్స్‌టర్నల్ పార్టీలకు Google బహిర్గతం చేయదు:

సమ్మతితో

మా దగ్గర తల్లిదండ్రుల సమ్మతి ఉన్నప్పుడు, Googleలో భాగం కాని కంపెనీలతో, సంస్థలతో లేదా వ్యక్తులతో (టీచర్‌లు లేదా అడ్మిన్‌ల వంటి వారు) వ్యక్తిగత సమాచారాన్ని Google షేర్ చేస్తుంది.

చట్టపరమైన కారణాల కోసం

సమాచారాన్ని యాక్సెస్ చేయడం, వినియోగించడం, స్టోర్ చేయడం లేదా బహిర్గతం చేయడం అన్నవి ఈ కింద పేర్కొన్న పనులను చేయడానికి సహేతుకంగా అవసరమని మాకు అపార నమ్మకం ఉంటే, Googleలో భాగం కాని కంపెనీలతో, సంస్థలతో లేదా వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని Google షేర్ చేస్తుంది:

ఎక్స్‌టర్నల్ ప్రాసెసింగ్ కోసం

మా సూచనల ప్రకారం, అలాగే మా గోప్యతా పాలసీతో పాటు తగిన ఇతర గోప్యత చర్యలకు, సెక్యూరిటీ చర్యలకు అనుగుణంగా మా తరఫున ప్రాసెస్ చేయడానికి, మా అనుబంధ సంస్థలకు లేదా ఇతర విశ్వసనీయ బిజినెస్‌లకు లేదా వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని Google అందించవచ్చు.

యాప్ వినియోగ ట్రెండ్‌లను చూపించడం లేదా రిపోర్టింగ్ విషయంలో పార్ట్‌నర్‌లతో ఒప్పందం ప్రకారం మాకు ఉన్న బాధ్యతలను నెరవేర్చడం వంటివి చేయడానికి, యాప్ వినియోగానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, థర్డ్-పార్టీలతో Google షేర్ చేయవచ్చు.

పరస్పర విరుద్ధంగా ఉండే నియమాల వివరణ

గోప్యతా ప్రకటనలో, Google గోప్యతా పాలసీలో ఉండే నియమాలలో ఏవైనా విరుద్ధంగా ఉన్నప్పుడు Google గోప్యతా పాలసీలో ఉండే నియమాలకు కాకుండా ఈ గోప్యతా ప్రకటనలో ఉండే నియమాలకు ప్రాధాన్యత ఉంటుంది.

సర్వీస్ ప్రొవైడర్

Read Along సర్వీస్‌ను అందిస్తున్న వారు:

Google LLC

1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043 USA

ఫోన్: +1 650-253-0000

EEA, స్విట్జర్లాండ్‌లలో:

Google Ireland Limited

Gordon House, Barrow Street, Dublin 4

Republic of Ireland

మమ్మల్ని సంప్రదించండి

తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే, వారు నేరుగా ఈ ఈమెయిల్ అడ్రస్‌కు మెయిల్ పంపవచ్చు: readalong@google.com