మేము సేకరించిన సమాచారాన్ని Google ఎలా నిలిపి ఉంచుతుంది
మీరు Google సేవలను ఉపయోగించినప్పుడు మేము డేటాను సేకరిస్తాము. మేము ఏమి సేకరిస్తాము, ఎందుకు సేకరిస్తాము మరియు మీరు మీ సమాచారాన్ని ఎలా నిర్వహించుకోగలరు అనేవి మా గోప్యతా విధానంలో వివరించబడ్డాయి. మేము వివిధ సమయ వ్యవధులకు ఎందుకు వివిధ రకాల డేటాలను నిల్వ చేసి పెట్టుకుంటామో ఈ నిలుపుదల విధానం వివరిస్తుంది.
కొంత డేటాను మీరు మీకు నచ్చినప్పుడు తొలగించగలరు, కొంత డేటా ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది మరియు కొంత డేటాని మేము అవసరమైనప్పుడు దీర్ఘకాల సమయ వ్యవధుల వరకు నిలిపి ఉంచుకుంటాము. మీరు డేటాను తొలగించినప్పుడు, మీ డేటా మా సర్వర్‌ల నుండి సురక్షితంగా మరియు పూర్తిగా తీసివేయబడిందా లేదా అనామక రూపంలో నిలిపి ఉందా అనేది నిర్ధారించుకోవడానికి మేము ఒక తొలగింపు విధానాన్ని అనుసరిస్తాము. Google డేటాను ఎలా అనామకంగా చేస్తుంది
మీరు సమాచారాన్ని తీసివేసే వరకు అది అలాగే నిలిపి ఉంటుంది
మీ Google ఖాతాలో నిల్వ చేసిన డేటాని సరిచేయడానికి లేదా తొలగించడానికి మిమ్మల్ని అనుమతించే పలు రకాల సేవలను మేము అందిస్తాము. ఉదాహరణకు, మీరు వీటిని చేయవచ్చు:
- మీ వ్యక్తిగత సమాచారాన్ని సవరించండి
- నా కార్యకలాపం నుండి అంశాలను తొలగించండి
- ఫోటోలు మరియు పత్రాలు వంటి కంటెంట్‌ను తొలగించండి
- మీ Google ఖాతా నుండి ఉత్పత్తిని తీసివేయండి
- మీ Google ఖాతాను పూర్తిగా తొలగించండి
మీరు తీసివేయడానికి ఎంచుకునే వరకు మేము ఈ డేటాను మీ Google ఖాతాలో ఉంచుతాము. మరియు మీరు మా సేవలను Google ఖాతాకు సైన్ ఇన్ చేయకుండా ఉపయోగించినట్లయితే, మా సేవలను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించే పరికరం, బ్రౌజర్ లేదా యాప్ వంటి వాటికి లింక్ చేయబడిన కొంత సమాచారాన్ని తొలగించే సామర్థ్యాన్ని కూడా మేము మీకు అందిస్తాము.
నిర్దిష్ట సమయ వ్యవధి తర్వాత గడువు ముగిసే డేటా
కొన్ని సందర్భాలలో, డేటాను తొలగించడానికి ఒక మార్గాన్ని అందించడం కన్నా, మేము దీనిని ముందుగా నిర్ణయించిన సమయ వ్యవధి వరకు స్టోర్ చేస్తాము. ప్రతి డేటా రకానికి, మేము దాని సేకరణ కారణం ఆధారంగా నిల్వ కొనసాగింపు సమయ వ్యవధులను సెట్ చేస్తాము. ఉదాహరణకు, వివిధ రకాల పరికరాలపై మా సర్వీస్‌లు సరిగ్గా ప్రదర్శించడానికి, మేము బ్రౌజర్ వెడల్పు, ఇంకా ఎత్తును 9 నెలల వరకు ఉంచుతాము. మేము నిర్ణీత సమయ వ్యవధిలో నిర్దిష్ట డేటాను అజ్ఞాతీకరించడానికి లేదా సాధారణీకరించడానికి కూడా చర్యలు తీసుకుంటాము. ఉదాహరణకు, మేము 9 నెలల తర్వాత IP అడ్రస్‌లో కొంత భాగాన్ని, అలాగే 18 నెలల తర్వాత కుక్కీ సమాచారాన్ని తీసివేయడం ద్వారా సర్వర్ లాగ్‌లలోని అడ్వర్టయిజింగ్ డేటాను అజ్ఞాతీకరిస్తాము. యూజర్‌ల Google ఖాతాల నుండి డిస్‌కనెక్ట్ చేయబడిన క్వెరీల వంటి సాధారణీకరణ డేటాను నిల్వను కూడా మేము నిర్ణీత వ్యవధి వరకు కొనసాగించవచ్చు.
మీ Google ఖాతా తొలగించబడే వరకు సమాచారం అలాగే దాగి ఉంటుంది
యూజర్‌లు మా ఫీచర్‌లతో ఎలా ఇంటరాక్ట్ అవుతారో, అలాగే మా సర్వీస్‌లను ఎలా మెరుగుపరుచుకోవాలో మేము అర్థం చేసుకోవడానికి సహాయపడడంలో మీ Google ఖాతాకు సంబంధించిన డేటా ఉపయోగకరంగా ఉంటే దాన్ని మేము శాశ్వతంగా ఉంచుతాము. ఉదాహరణకు, మీరు Google Mapsలో సెర్చ్ చేసిన అడ్రస్‌ను మీరు తొలగించినట్లయితే, ఇప్పటికీ మీ ఖాతా మీరు దిశల ఫీచర్‌ను ఉపయోగించారనే విషయాన్ని స్టోర్ చేయవచ్చు. దీని వలన, భవిష్యత్తులో మీకు దిశల ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలనే దాని గురించి Google Maps సూచనలను చూపించకుండా ఉండగలదు.
పరిమిత ప్రయోజనాల కోసం పొడిగించిన సమయ వ్యవధుల వరకు సమాచారం నిలిచి ఉంది
కొన్నిసార్లు వ్యాపార మరియు చట్టపరమైన అవసరాలు మమ్మల్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం పొడిగించిన సమయ వ్యవధి వరకు నిర్దిష్ట సమాచారాన్ని నిలిపి ఉంచుకోవాలని మాకు నిర్దేశిస్తాయి. ఉదాహరణకు, Google మీకు చెల్లింపును ప్రాసెస్ చేస్తున్నప్పుడు లేదా మీరు Googleకు చెల్లింపు చేసినప్పుడు, మేము ఈ డేటాను పన్ను లేదా అకౌంటింగ్ ప్రయోజనాల కోసం అవసరమైనంత దీర్ఘకాల సమయ వ్యవధుల వరకు ఉంచుతాము. మేము డేటాను దీర్ఘకాల సమయ వ్యవధుల వరకు నిలిపి ఉంచుకోవడానికి గల కారణాలలో ఇవి ఉంటాయి:
- భద్రత, మోసం & దుర్వినియోగం నివారణ
- ఆర్థిక రికార్డ్ ఉంచడానికి
- చట్టపరమైన లేదా నియంత్రణ అవసరాల అనుసరణ
- మా సేవల కొనసాగింపు నిర్ధారణకు
- Googleతో ప్రత్యక్ష కమ్యూనికేషన్‌లు
సురక్షిత మరియు పూర్తి తొలగింపును ప్రారంభించడం
మీరు మీ Google ఖాతాలో డేటాను తొలగిస్తున్నప్పుడు, మేము వెంటనే దాన్ని ఉత్పత్తి మరియు మా సిస్టమ్‌ల నుండి తీసివేసే ప్రక్రియను ప్రారంభిస్తాము. ముందుగా, మేము దీన్ని వెంటనే వీక్షణ నుండి తీసివేయడానికి ప్రయత్నిస్తాము మరియు మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఇకపై డేటా ఉపయోగించబడకపోవచ్చు. ఉదాహరణకు, మీరు నా కార్యకలాపం డాష్‌బోర్డ్ నుండి మీరు చూసిన వీడియోను తొలగించినట్లయితే, వెంటనే YouTube ఆ వీడియో కోసం మీ వాచ్ పురోగతిని ఆపివేస్తుంది.
ఆపై మేము మా నిల్వ సిస్టమ్‌ల నుండి డేటాను సురక్షితంగా మరియు పూర్తిగా తొలగించడానికి రూపొందించిన ఒక ప్రక్రియను ప్రారంభిస్తాము. ప్రమాదవశాత్తు డేటా నష్టం నుండి మా వినియోగదారులు మరియు కస్టమర్‌లను రక్షించడానికి సురక్షిత తొలగింపు ముఖ్యం. మా సర్వర్‌ల నుండి పూర్తి డేటా తొలగింపు అనేది వినియోగదారుల ప్రశాంతతకు కూడా అంతే సమానంగా ముఖ్యమైనది. ఈ ప్రక్రియకు సాధారణంగా తొలగింపు సమయం నుండి 2 నెలలు పడుతుంది. డేటా అనుకోకుండా తీసివేయబడినట్లయితే ఇది తరచుగా ఒక నెల వరకు రికవరీ వ్యవధిని కలిగి ఉంటుంది.
సురక్షితమైన మరియు పూర్తి తొలగింపు కోసం డేటా తొలగించబడే ప్రతి Google నిల్వ సిస్టమ్‌కి స్వంత వివరణాత్మక ప్రక్రియ ఉంది. ఇది డేటా అంతా తొలగించినట్లు నిర్ధారించడానికి సిస్టమ్ ద్వారా పునరావృతం చేయబడిన పాస్‌లను కలిగి ఉండవచ్చు లేదా తప్పులు నుండి పునరుద్ధరణకు అనుమతించడానికి సంక్షిప్త ఆలస్యాలు ఉండవచ్చు. ఫలితంగా, డేటాను సురక్షితంగా మరియు పూర్తిగా తొలగించడానికి అదనపు సమయం అవసరమైనప్పుడు తొలగింపుకు కొన్నిసార్లు ఎక్కువ సమయం పడుతుంది.
మా సేవలు సంభావ్య వైపరీత్యాల నుండి పునరుద్ధరణ అయ్యేందుకు సహాయపడడానికి ఎన్‌క్రిప్ట్ చేయబడిన బ్యాకప్ నిల్వను మరొక రక్షణ లేయర్‌గా కూడా ఉపయోగిస్తాయి. ఈ సిస్టమ్‌లలో డేటా 6 నెలలు వరకు అలాగే ఉండగలదు.
ప్రతి తొలగింపు ప్రక్రియ మాదిరిగా, మా ప్రోటోకాల్‌లలోని సాధారణ నిర్వహణ, ఊహించని అలభ్యతలు, బగ్‌లు లేదా వైఫల్యాలు వంటి విషయాలు ఈ కథనంలో నిర్వచించిన ప్రక్రియలు మరియు సమయ వ్యవధులలో ఆలస్యాలకు కారణం కావచ్చు. మేము అటువంటి సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి రూపొందించబడిన సిస్టమ్‌లను నిర్వహిస్తాము.
భద్రత, మోసం & దుర్వినియోగం నివారణ
వివరణ
మోసం, దుర్వినియోగం మరియు అనధికార యాక్సెస్ నుండి మిమ్మల్ని, ఇతర వ్యక్తులను మరియు Googleను రక్షించడానికి.
సందర్భాలు
ఉదాహరణకు, Google ఎవరైనా ప్రకటన మోసం చేస్తున్నట్లు అనుమానించినప్పుడు.
ఆర్థిక రికార్డ్ ఉంచడానికి
వివరణ
మీ చెల్లింపును ప్రాసెస్ చేస్తున్నప్పుడు లేదా మీరు Googleకు చెల్లింపు చేసినప్పుడు, Google ఆర్థిక లావాదేవీకి సంబంధించిన పార్టీ అయినప్పుడు. ఈ సమాచారం యొక్క సుదీర్ఘ నిలుపుదల అకౌంటింగ్, వివాద పరిష్కారానికి తరుచుగా అవసరమవుతుంది మరియు పన్ను, ప్రభుత్వానికి ఆస్తి సంక్రమణ, నగదు బదిలీ వ్యతిరేకత మరియు ఇతర ఆర్థిక నిబంధనలకు కట్టుబడి ఉంటుంది.
సందర్భాలు
ఉదాహరణకు, మీరు Play స్టోర్ నుండి యాప్‌లను లేదా Google స్టోర్ నుండి ఉత్పత్తులు కనుగోలు చేసినప్పుడు.
చట్టపరమైన లేదా నియంత్రణ అవసరాల అనుసరణ
వివరణ
ఏదైనా వర్తించదగిన చట్టం, నిబంధన, చట్టపరమైన ప్రక్రియ లేదా అమలు చేయదగిన ప్రభుత్వపరమైన అభ్యర్థనకు అనుగుణంగా ఉండడానికి లేదా సంభావ్య ఉల్లంఘనల పరిశీలనతో సహా వర్తించదగిన సేవా నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది.
సందర్భాలు
ఉదాహరణకు, Google చట్టబద్ధమైన సాక్షి సమను స్వీకరించినట్లయితే.
మా సేవల కొనసాగింపు నిర్ధారణకు
వివరణ
మీరు మరియు ఇతర వినియోగదారులకు సేవ కొనసాగింపును నిర్ధారించడానికి.
సందర్భాలు
ఉదాహరణకు, మీరు ఇతర వినియోగదారులతో సమాచారాన్ని షేర్ చేసినప్పుడు (మీరు మరొకరికి ఒక ఇమెయిల్‌ని పంపడం వంటివి), దాన్ని మీ Google ఖాతా నుండి తొలగించడం అనేది స్వీకర్తలు నిర్వహించే కాపీలను తొలగించదు.
Googleతో ప్రత్యక్ష కమ్యూనికేషన్‌లు
వివరణ
మీరు కస్టమర్ మద్దతు ఛానెల్, అభిప్రాయ ఫారమ్ లేదా బగ్ నివేదిక ద్వారా నేరుగా Googleతో కమ్యూనికేట్ చేసినట్లయితే, Google ఆ కమ్యూనికేషన్‌ల యొక్క సమంజస రికార్డ్‌లను నిలిపి ఉంచుకోవచ్చు.
సందర్భాలు
ఉదాహరణకు, మీరు Gmail లేదా డిస్క్ వంటి Google యాప్‌లలో అభిప్రాయాన్ని పంపినప్పుడు.