కీలక పదాలు
- అనుబంధ సంస్థలు
- అనువర్తన డేటా కాష్
- అల్గారిథమ్
- కుక్కీలు
- పరికరం
- పిక్సెల్ ట్యాగ్
- బ్రౌజర్ వెబ్ నిల్వ
- విశిష్ఠ ఐడెంటిఫైయర్‌లు
- వ్యక్తిగత సమాచారం
- వ్యక్తిగతంగా గుర్తించలేని సమాచారం
- సర్వర్ లాగ్‌లు
- సిఫార్సు చేసిన URL
- సున్నితమైన వ్యక్తిగత సమాచారం
- Google ఖాతా
- IP చిరునామా
అనుబంధ సంస్థలు
EUలో వినియోగదారు సేవలను అందించే కింది సంస్థలతో సహా Google సంస్థల సమూహానికి చెందిన సంస్థను అనుబంధ సంస్థ అని అంటారు: Google Ireland Limited, Google Commerce Ltd, Google Payment Corp మరియు Google Dialer Inc. EUలో వ్యాపార సేవలను అందించే సంస్థల గురించి మరింత తెలుసుకోండి.
అనువర్తన డేటా కాష్
అనువర్తన డేటా కాష్ అనేది పరికరంలోని డేటా నిక్షేప స్థానం. ఇది చేయగలిగేది, ఉదాహరణకు, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా వెబ్ అనువర్తనం అమలు అయ్యేలా అనుమతించడం మరియు కంటెంట్‌ను వేగంగా లోడ్ చేయడాన్ని ప్రారంభించడం ద్వారా అనువర్తనం యొక్క పనితీరును మెరుగుపరచడం.
అల్గారిథమ్
సమస్యలను పరిష్కరించే చర్యలను అమలు చేయడంలో భాగంగా కంప్యూటర్ ఉపయోగించే ఒక ప్రక్రియ లేదా కొన్ని నియమాలు.
కుక్కీలు
కుక్కీ అనేది మీరు ఒక వెబ్‌సైట్‌ని సందర్శించినప్పుడు మీ కంప్యూటర్‌కు పంపబడే అక్షరాల వాక్యాన్ని కలిగి ఉన్న ఒక చిన్న ఫైల్. మీరు సైట్‌ని మళ్లీ సందర్శించినప్పుడు, మీ బ్రౌజర్‌ని గుర్తించడానికి ఆ సైట్‌ని కుక్కీ అనుమతిస్తుంది. కుక్కీలు వినియోగదారు ప్రాధాన్యతలను మరియు ఇతర సమాచారాన్ని నిల్వ చేయవచ్చు. అన్ని కుక్కీలను తిరస్కరించే విధంగా లేదా కుక్కీ పంపబడుతున్నప్పుడు సూచించే విధంగా మీరు మీ బ్రౌజర్‌ని కాన్ఫిగర్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ, కుక్కీలు లేకుంటే కొన్ని వెబ్‌సైట్ ఫీచర్‌లు లేదా సేవలు సరిగ్గా పని చేయకపోవచ్చు. మీరు మా భాగస్వామి సైట్‌లు లేదా యాప్‌లను ఉపయోగించినప్పుడు, కుక్కీలను Google ఎలా ఉపయోగిస్తుంది మరియు కుక్కీలతో సహా డేటాను Google ఎలా ఉపయోగిస్తుంది అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.
పరికరం
పరికరం అంటే Google సేవలను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే కంప్యూటర్. ఉదాహరణకు, డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ స్పీకర్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌లు వంటి అన్ని పరికరాలు పరిగణనలోకి తీసుకోబడతాయి.
పిక్సెల్ ట్యాగ్
వెబ్‌సైట్ యొక్క వీక్షణలు లేదా ఇమెయిల్ ఎప్పుడు తెరవబడింది వంటి నిర్దిష్ట కార్యకలాపాన్ని ట్రాక్ చేయడం కోసం వెబ్‌సైట్‌లో లేదా ఇమెయిల్ యొక్క ప్రధాన భాగంలో ఉంచబడే ఒక రకమైన సాంకేతికతను పిక్సెల్ ట్యాగ్ అని అంటారు. తరచుగా పిక్సెల్ ట్యాగ్‌లు మరియు కుక్కీలు కలిపి ఉపయోగించబడుతుంటాయి.
బ్రౌజర్ వెబ్ నిల్వ
బ్రౌజర్ వెబ్ నిల్వ పరికరంలోని బ్రౌజర్‌లో డేటాను నిల్వ చేయడానికి వెబ్‌సైట్‌లను అనుమతిస్తుంది. "స్థానిక నిల్వ" మోడ్‌ని ఉపయోగించినప్పుడు, ఇది సెషన్‌ల అంతటా డేటాని నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా బ్రౌజర్‌ని మూసివేసినా మరియు తిరిగి తెరిచినా కూడా డేటాని తిరిగి పొందడం సాధ్యం చేస్తుంది. వెబ్ నిల్వ సదుపాయం కల్పించే ఒక సాంకేతికత HTML 5.
విశిష్ఠ ఐడెంటిఫైయర్‌లు
విశిష్ఠ ఐడెంటిఫైయర్ అనేది బ్రౌజర్, యాప్ లేదా పరికరాన్ని విశిష్ఠంగా గుర్తించడానికి ఉపయోగించగల ఒక అక్షరాల వాక్యం. ఎంత వరకు చెల్లుబాటు అవుతాయి, వినియోగదారులు వాటిని రీసెట్ చేయవచ్చా లేదా మరియు వాటిని ఎలా యాక్సెస్ చేయవచ్చు అన్న వాటి ఆధారంగా ఐడెంటిఫైయర్‌లు రకరకాలుగా ఉంటాయి.
భద్రత మరియు మోసం గుర్తింపు, మీ ఇమెయిల్ ఇన్‌బాక్స్ వంటి సమకాలీకరణ సేవలు, మీ ప్రాధాన్యతలను గుర్తుంచుకోవడం మరియు వ్యక్తిగతీకరించబడిన వ్యాపార ప్రకటనను అందించడంతో పాటు అనేక రకాల అవసరాల కోసం విశిష్ఠ ఐడెంటిఫైయర్‌లు ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, సైట్‌లు మీ బ్రౌజర్‌లోని కంటెంట్‌ని మీ ప్రాధాన్య భాషలో ప్రదర్శించడంలో కుక్కీలలో నిల్వ చేయబడిన విశిష్ఠ ఐడెంటిఫైయర్‌లు సహాయపడతాయి. అన్ని కుక్కీలను తిరస్కరించే విధంగా లేదా కుక్కీ పంపబడుతున్నప్పుడు సూచించే విధంగా మీరు మీ బ్రౌజర్‌ని కాన్ఫిగర్ చేయవచ్చు. కుక్కీలను Google ఎలా ఉపయోగిస్తుంది అన్నది మరింత తెలుసుకోండి.
బ్రౌజర్‌లు కాకుండా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో, నిర్దిష్ట పరికరాన్ని లేదా ఆ పరికరంలోని యాప్‌ని గుర్తించడం కోసం విశిష్ఠ ఐడెంటిఫైయర్‌లు ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, Android పరికరాలలో సంబంధిత వ్యాపార ప్రకటనలను అందించడం కోసం వ్యాపార ప్రకటన ID వంటి విశిష్ఠ ఐడెంటిఫైయర్ ఉపయోగించబడుతుంది మరియు దీనిని మీ పరికర సెట్టింగ్‌లలో నిర్వహించవచ్చు. మొబైల్ ఫోన్ యొక్క IMEI-సంఖ్య వంటి విశిష్ఠ ఐడెంటిఫైయర్‌లను ఆ పరికర తయారీదారు కూడా వాటిలో చేర్చవచ్చు (కొన్నిసార్లు సార్వజనీనంగా విశిష్ఠ ID లేదా UUID అంటారు). ఉదాహరణకు, మీ పరికరం కోసం మా సేవను అనుకూలీకరించడం లేదా మా సేవలకు సంబంధించిన పరికర సమస్యలను విశ్లేషించడంలో పరికర విశిష్ఠ ఐడెంటిఫైయర్ ఉపయోగించబడుతుంది.
వ్యక్తిగత సమాచారం
ఇది మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించగలిగేలా మీరు మాకు అందించే సమాచారం, ఉదాహరణకు మీ పేరు, ఇమెయిల్ చిరునామా లేదా బిల్లింగ్ సమాచారం లేదా Google ద్వారా అటువంటి సమాచారానికి సహేతుకంగా లింక్ చేయగల ఇతర డేటా, మేము మీ Google ఖాతాతో అనుబంధించే సమాచారం వంటిది.
వ్యక్తిగతంగా గుర్తించలేని సమాచారం
ఇది వినియోగదారుల గురించి రికార్డ్ చేయబడే సమాచారం, కనుక ఇది వ్యక్తిగతంగా గుర్తించగలిగిన వినియోగదారుని ప్రతిబింబించదు లేదా సూచించదు.
సర్వర్ లాగ్‌లు
అనేక వెబ్‌సైట్‌లలో, మీరు మా సైట్‌లను సందర్శించినప్పుడు అభ్యర్థించిన పేజీలను మా సర్వర్‌లు స్వయంచాలకంగా నమోదు చేస్తాయి. మీ బ్రౌజర్‌ని ప్రత్యేకంగా గుర్తించే మీ వెబ్ అభ్యర్థన, ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామా, బ్రౌజర్ రకం, బ్రౌజర్ భాష, మీ అభ్యర్థన యొక్క తేదీ మరియు సమయం లేదా మరిన్ని కుక్కీలను ఈ “సర్వర్ లాగ్‌లు” సాధారణంగా చేర్చుతాయి.
“కార్లు” కోసం చేసిన శోధన యొక్క సాధారణ లాగ్ నమోదు ఇలా కనిపిస్తుంది:
123.45.67.89 - 25/Mar/2003 10:15:32 -
http://www.google.com/search?q=cars -
Chrome 112; OS X 10.15.7 -
740674ce2123e969
123.45.67.89
వినియోగదారు ISP ద్వారా వినియోగదారుకి కేటాయించబడే ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామా. వినియోగదారు సేవ ఆధారంగా, వినియోగదారు ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన ప్రతిసారీ వారి సేవ ప్రదాత విభిన్న చిరునామాని కేటాయించవచ్చు.25/Mar/2003 10:15:32
ప్రశ్న యొక్క తేదీ మరియు సమయం.http://www.google.com/search?q=cars
శోధన ప్రశ్నతో పాటు అభ్యర్థించబడిన URL.Chrome 112; OS X 10.15.7
ఉపయోగించబడుతున్న బ్రౌజర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్.740674ce2123a969
ఈ నిర్దిష్ట కంప్యూటర్ మొదటిసారిగా Googleని సందర్శించినప్పుడు దీనికి కేటాయించబడిన విశిష్ఠ కుక్కీ ID. (కుక్కీలను వినియోగదారులు తొలగించవచ్చు. వినియోగదారు కనుక వారు చివరిసారిగా Googleని సందర్శించిన తర్వాత కంప్యూటర్ నుండి కుక్కీని తొలగిస్తే, వారు తదుపరిసారి ఆ నిర్దిష్ట పరికరం నుండి Googleని సందర్శించినప్పుడు వారి పరికరానికి కేటాయించబడేది విశిష్ఠ కుక్కీ ID అవుతుంది).
సిఫార్సు చేసిన URL
వెబ్ బ్రౌజర్ ద్వారా గమ్యస్థాన వెబ్‌పేజీకి సిఫార్సు చేసిన URL (యూనిఫారమ్ రిసోర్స్ లొకేటర్) సమాచారం బదిలీ చేయబడుతుంది, సాధారణంగా మీరు ఆ పేజీకి సంబంధించిన లింక్‌ని క్లిక్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది. సిఫార్సు చేసిన URLలో బ్రౌజర్ ద్వారా సందర్శించిన చివరి వెబ్‌పేజీ యొక్క URL ఉంటుంది.
సున్నితమైన వ్యక్తిగత సమాచారం
ఇది గోప్యనీయమైన వైద్యపరమైన వాస్తవాలకు, జాతి లేదా నిర్దిష్ట జాతికి సంబంధించిన వాస్తవాలకు, రాజకీయ లేదా ప్రాంతీయ నమ్మకాలకు లేదా లైంగికత వంటి అంశాలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం యొక్క ప్రత్యేకమైన వర్గం.
Google ఖాతా
మీరు Google ఖాతా కోసం సైన్ అప్ చేసి, కొంత వ్యక్తిగత సమాచారాన్ని (సాధారణంగా మీ పేరు, ఇమెయిల్ చిరునామా మరియు పాస్‌వర్డ్ వంటివి) మాకు అందించడం ద్వారా మా సేవలలో కొన్నింటిని యాక్సెస్ చేయవచ్చు. మీరు Google సేవలను యాక్సెస్ చేసినప్పుడు మిమ్మల్ని ప్రమాణీకరించడం కోసం మరియు ఇతరులు యాక్సెస్ చేయకుండా మీ ఖాతాని రక్షించడం కోసం ఈ ఖాతా సమాచారం ఉపయోగించబడుతుంది. ఏ సమయంలో అయినా మీ Google ఖాతా సెట్టింగ్‌ల ద్వారా మీరు మీ ఖాతాని సవరించవచ్చు లేదా తొలగించవచ్చు.
IP చిరునామా
ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన ప్రతి పరికరానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) అడ్రస్ అని పిలిచే ఒక నంబర్ కేటాయించబడుతుంది. సాధారణంగా ఈ సంఖ్యలు భౌగోళిక బ్లాక్‌లలో కేటాయించబడతాయి. IP అడ్రస్‌ను తరచూ పరికరం ఇంటర్నెట్‌కు ఏ లొకేషన్ నుండి కనెక్ట్ అవుతుందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. లొకేషన్ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోండి.