ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.
"మరిన్ని సందర్భోచిత శోధన ఫలితాలు"
ఉదాహరణలు
- ఉదాహరణకు, మీకు మరియు మీ స్నేహితులకు సంబంధించిన ఫోటోలు, పోస్ట్‌లు మరియు మరిన్నింటిని చేర్చడం ద్వారా మేము మీ కోసం శోధనను మరింత సందర్భోచితంగా మరియు ఆసక్తికరంగా చేయగలము. Google+తో సైన్ ఇన్ చేసినప్పుడు, మీకు తెలిసిన లేదా మీరు అనుసరించే వ్యక్తుల యొక్క వ్యక్తీకరించిన ఫలితాలు మరియు ప్రొఫైల్‌లను మీరు కనుగొంటారు మరియు మీరు తెలిసిన లేదా మిమ్మల్ని అనుసరించే వ్యక్తులు వారి ఫలితాల్లో మీ పోస్ట్‌లు మరియు ప్రొఫైల్‌ను చూడవచ్చు. మీరు Google మరియు ఇతర శోధన ఇంజిన్‌లు మీ ప్రొఫైల్‌ను సూచించకూడదనుకుంటే, మీ ప్రొఫైల్ సెట్టింగ్‌లను ఎప్పుడైనా మార్చవచ్చు. మరింత తెలుసుకోండి.
- మీరు మీ Google ఖాతాకి సైన్ చేసి, వెబ్ హిస్టరీని ప్రారంభించి ఉంటే, మీ వెబ్ చరిత్ర ఆధారంగా మరిన్ని సందర్భోచిత శోధన ఫలితాలను పొందవచ్చు. వెబ్ చరిత్ర మీ శోధనలను మరియు ఇతర వెబ్ కార్యాచరణను కలిగి ఉంటుంది. మీరు సైన్ అవుట్ చేసినప్పటికీ మీ కంప్యూటర్ నుండి శోధన కార్యాచరణను ఉపయోగించి మీ శోధన ఫలితాలు కూడా అనుకూలీకరించబడవచ్చు. మరింత తెలుసుకోండి.