ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.
"ఒక సేవలోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతర Google సేవల్లోని సమాచారంతో అలాగే వ్యక్తిగత సమాచారంతో మిళితం చేయడం"
ఉదాహరణలు
- ఉదాహరణకు, మీరు మీ Google ఖాతాకి సైన్ ఇన్ చేసి, Googleలో శోధించేటప్పుడు, మీరు మీ స్నేహితులకు సంబంధించిన పేజీలు, ఫోటోలు మరియు Google+ పోస్ట్‌లతో పాటుగా పబ్లిక్ వెబ్ నుండి శోధన ఫలితాలను చూడగలరు మరియు Google+లో మీరు తెలిసిన లేదా మిమ్మల్ని అనుసరించే వ్యక్తులు వారి ఫలితాల్లో మీ పోస్ట్‌లను మరియు ప్రొఫైల్‌లను చూడగలరు. మీరు ఉపయోగిస్తున్న Gmail లేదా Google క్యాలెండర్ వంటి ఇతర Google ఉత్పత్తుల్లో మీరు కలిగి ఉన్న కంటెంట్ నుండి సందర్భోచిత సమాచారాన్ని కూడా కనుగొనవచ్చు.
- మీరు ఇటలీ పర్యటనను ప్లాన్ చేసి, Googleలో "ఫ్లోరెన్స్" అని శోధిస్తే, మీ శోధన ఫలితాల్లో ఫ్లోరెన్స్ గురించి మీ స్నేహితుల నుండి ఫోటోలు లేదా కథనాలు మీరు చూడవచ్చు. ఈ ఫలితాలు వారి సిఫార్సులను విశ్లేషించడాన్ని మరియు చూడదగిన ప్రదేశాల గురించి సంభాషణను ప్రారంభించడాన్ని సులభం చేస్తాయి. మరింత తెలుసుకోండి.
- Google Now మీరు ఇతర Google ఉత్పత్తుల్లో నిల్వ చేసిన డేటాను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, మీ వెబ్ చరిత్రలో శోధనలను నిల్వ చేసి ఉంటే, Google Now ఆ గత శోధనల ఆధారంగా క్రీడల స్కోర్‌లు, విమాన స్థితుల మరియు మరిన్నింటికి సంబంధించిన సమాచార కార్డ్‌లను చూపవచ్చు. మీ వెబ్ హిస్టరీని నిర్వహించడానికి, google.com/history/ని సందర్శించండి. మీరు మీ వెబ్ హిస్టరీని తొలగించి లేదా పాజ్ చేసి కూడా ఇప్పటికీ Google Nowను ఉపయోగించవచ్చు, కానీ కొన్ని రకాల సమాచారాలు చూపబడవు. మరింత తెలుసుకోండి.
- మీరు వ్యాపార అపాయింట్‌మెంట్ కోసం Google క్యాలెండర్ నమోదును కలిగి ఉంటే, Google Now ట్రాఫిక్‌ను తనిఖీ చేసి, మీ అపాయింట్‌మెంట్‌కు సరైన సమయంలో చేరుకోవడానికి ఎప్పుడు బయలుదేరాలో సూచించవచ్చు.