ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.
"మీరు అత్యంత ఉపయోగకరంగా గుర్తించే ప్రకటనలు"
ఉదాహరణలు
- ఉదాహరణకు, మీరు తరచుగా తోటపని గురించి వెబ్‌సైట్‌లను మరియు బ్లాగ్‌లను సందర్శిస్తే, వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీకు తోటపనికి సంబంధించిన ప్రకటనలు కనిపించవచ్చు. అలాగే మీరు YouTubeలో బేకింగ్ గురించి వీడియోలను చూస్తే, బేకింగ్‌కు సంబంధించిన మరిన్ని ప్రకటనలను చూడవచ్చు. మరింత తెలుసుకోండి.
- మేము మీ సుమారు స్థానాన్ని గుర్తించడానికి మీ ప్రస్తుత IP-చిరునామాను ఉపయోగిస్తాము, తద్వారా మీరు “పిజ్జా” కోసం శోధిస్తే సమీప పిజ్జా బట్వాడా సేవ యొక్క ప్రకటనలను మీకు అందిస్తాము లేదా మీరు "చలన చిత్రం" కోసం శోధిస్తే సమీపంలోని చలన చిత్రం యొక్క ప్రదర్శన సమయాలను మీకు చూపుతాము. మరింత తెలుసుకోండి.
- మీకు అత్యంత సందర్భోచిత ప్రకటనలను అందించడానికి మా సిస్టమ్ మా సేవల్లోని కంటెంట్‌ను అనగా Gmailలోని ఇమెయిల్‌లను స్వయంచాలకంగా స్కాన్ చేయవచ్చు. కాబట్టి మీరు ఇటీవల ఫోటోగ్రఫీ లేదా కెమెరాల గురించి చాలా సందేశాలను స్వీకరించారంటే, ఒకవేళ మీకు స్థానిక కెమెరా స్టోర్‌లోని డీల్ గురించి ఆసక్తి ఉండవచ్చు. అలా కాకుండా, మీరు ఈ సందేశాలను స్పామ్ అని నివేదించారంటే, మీకు బహుశా ఆ డీల్ చూడాలనే కోరిక ఉండకపోవచ్చు. ఈ రకమైన స్వయంచాలక ప్రాసెసింగ్ అనేది చాలా ఇమెయిల్ సేవలు అందిస్తోన్న స్పామ్ ఫిల్టరింగ్ మరియు అక్షరక్రమ తనిఖీ వంటి లక్షణాల్లాంటిదే. Gmailలో వ్యాపార ప్రకటనలు లక్ష్యం చేసే విధానం పూర్తిగా స్వయంచాలితం మరియు మీకు ప్రకటనలను లేదా సంబంధిత సమాచారాన్ని చూపడానికి మనుషులు ఎవరూ మీ ఇమెయిల్ లేదా Google ఖాతా సమాచారాన్ని చూడరు. ఇక్కడ Gmailలో ప్రకటనల గురించి మరింత తెలుసుకోండి.